Rana Daggubati: తమిళంలో ఈ వారం రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్న సినిమా ‘డోరతీ’. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. డోరతీ ప్రేక్షకుల ముందుకు వచ్చాక.. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారి..సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నాయి. అయినా, ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు రానా దగ్గుబాటి.
కంటెంట్ బావుంటే తమిళ సినిమా, కన్నడ సినిమా, మలయాళ సినిమా అని చూడకుండా మన టాలీవుడ్ మేకర్ థియేట్రికల్ రైట్స్ తీసుకొని ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. వీటిలో చాలా సినిమాలు మన మేకర్స్ మంచి లాభాలు తెచ్చిపెడుతున్నాయి. అప్పట్లో, కాంతార సినిమా అంతే. అల్లు అరవింద్ ఈ సినిమా తెలుగు థియేట్రికల్ అండ్ ఓటీటీ రైట్స్ తీసుకున్నారు. రెండు చోట్లా మంచి లాభాలను అందుకున్నారు.
రానా కూడా ఒకవైపు నిర్మాతగా చేస్తూనే..ఇలా, కథ బావున్న సినిమాలను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కీర్తి సురేష్ నటించిన డోరతీ సినిమాను రానా దగ్గుబాటి తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించడం బాగా కలిసి వచ్చే అంశం.
రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా ఈ చిత్ర తెలుగు రాష్ట్రాల రైట్స్‌ను దక్కించుకొని.. ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల్లో గాంధీ జయంతి సందర్భంగా 2026, అక్టోబర్ 2న భారీ స్థాయిలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. కీర్తి సురేష్, సనంత్, రిషికాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాపై ఎక్కువగా నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. అదే, ప్లస్ పాయింట్ అని మేకర్స్ నమ్ముతున్నారు. కాగా, ప్రముఖ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో మంచి ఆదరణ దక్కించుకోవడం కూడా విశేషం. తమిళంలో డివైడ్ టాక్ తెచ్చుకున్న డోరతీ తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటో చూడాలి.








