తెలంగాణ

Rotten Meat: కుళ్లిన గుడ్లు, మురిగిన మాంసం, ఇంజనాయిల్ లాంటి ఆయిల్.. హోటల్స్‌, రెస్టారెంట్లలో దారుణాలు

రచన: NK•••4 నిమిషాల పఠనం

కుళ్లిన గుడ్లతో ఆమ్లెట్లు.. మురిగిపోయిన మాంసంతో వేపుళ్లు.. ఇంజనాయిల్ లాంటి ఆయిల్ తో ఫ్రైడ్ చికెన్.. సింథటిక్ ఫుడ్ కలర్స్.. ఎక్స్ పైరీ ఫుడ్ ఐటెమ్స్.. లేబుల్స్ లేని ఆహార పదార్ధాలు.. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లోని హోటల్స్, రెస్టారెంట్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన సోదాల్లో ఈ దారుణాలు వెలుగుచూశాయి.

Rotten Meat: కుళ్లిన గుడ్లతో ఆమ్లెట్లు.. మురిగిపోయిన మాంసంతో వేపుళ్లు.. ఇంజనాయిల్ లాంటి ఆయిల్ తో ఫ్రైడ్ చికెన్.. సింథటిక్ ఫుడ్ కలర్స్.. ఎక్స్ పైరీ ఫుడ్ ఐటెమ్స్.. లేబుల్స్ లేని ఆహార పదార్ధాలు.. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లోని హోటల్స్, రెస్టారెంట్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన సోదాల్లో ఈ దారుణాలు వెలుగుచూశాయి. హోటల్, రెస్టారెంట్ ఫుడ్ ను లొట్టలు వేసుకుంటూ తినే వారికి ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఫ్యామిలీతోనో, ఫ్రెండ్స్ తోనో కలిసి హోటల్ కో, రెస్టారెంట్ కో వెళ్లి ఇలాంటి ఆహారం తిన్నారంటే జబ్బుల బారిన పడటం ఖాయం అంటున్నారు డాక్టర్లు.

రీయూజ్డ్ వంటనూనె, సింథటిక్ ఫుడ్‌కలర్స్ సీజ్

హైదరాబాద్ మాదాపూర్ లోని మొనాస్టరీ యాంఫి బ్రూవరీ హోటల్ లో టీజీ సేఫ్ అధికారుల తనిఖీలు చేశారు. అక్కడ గడువు ముగిసిన పంది మాంసాన్ని గుర్తించారు. వండిన ఆహార పదార్ధాలను ఫ్రీజర్స్ లో నిల్వ ఉంచడం చూశారు. 5 కిలోల రీయూజ్డ్ వంట నూనెను, సింథటిక్ ఫుడ్ కలర్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక, కిచెన్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు.

గడువు ముగిసిన ఆహార పదార్ధాలు

అటు వరంగల్, కామారెడ్డిలోని హోటల్స్, రెస్టారెంట్స్ లోనూ ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ సోదాల్లో మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెలుగుచూశాయి. అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి అధికారులే విస్తుపోయారు. వరంగల్ లో ఆల్ఫారామ్ హోటల్ లో, కామారెడ్డిలోని మాల్గుడి రెస్టారెంట్ లో టీజీ సేఫ్ అధికారులు తనిఖీలు చేశారు. కిచెన్ అపరిశుభ్రత, ఆహార నాణ్యత, నిల్వ పద్ధతులపై పరిశీలన చేశారు. గడువు ముగిసిన ఆహార పదార్ధాలను అధికారులు గుర్తించారు. ఆహార భద్రతకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినట్లు అధికారులు కనుగొన్నారు.

సింథటిక్ ఫుడ్ కలర్స్‌తో ఆరోగ్యానికి ముప్పు

సింథటిక్ కలర్స్ వాడొద్దని అధికారులు పదే పదే చెబుతున్నా హోటల్స్, రెస్టారెంట్ల నిర్వహకులు పట్టించుకోవడం లేదు. యధేచ్చగా వాటిని ఆహార పదార్ధాల్లో వాడేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ఆహార భద్రత నిబంధనలు ఉలంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. మరోవైపు హోటల్స్, రెస్టారెంట్స్ కి వెళ్లి ఫుడ్ తినే వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తింటే అనారోగ్యం బారిన పడటం ఖాయం అంటున్నారు.

#Rotten Meat#Hyderabad#Hotels#Restaurants#Warangal#Kamareddy#TG Safe#Food Safety Officers#Raids#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి