సినిమా

Srikanth Odela: నాని అన్న నన్ను భరించాల్సిందే..వేరే ఆప్షన్ లేదు!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Srikanth Odela: నాని అన్న నన్ను భరించాల్సిందే..వేరే ఆప్షన్ లేదు..అంటూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ది ప్యారడైజ్ మూవీ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ‘దసరా’ సినిమాతో ఈ ఇద్దరూ కలిసి సృష్టించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ ప్రేక్షకులకు ఇంకా గుర్తుంది. దీంతో వీరి కాంబోలో మరో సినిమా అనగానే అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఇక, తాజాగా శ్రీకాంత్ ఓదెల చేసిన వ్యాఖ్యలు ఈ అంచనాలను మరింత పెంచుతున్నాయి. తన వర్కింగ్ స్టైల్, సినిమాపై తనకున్న పట్టుదల గురించి మాట్లాడుతూ.. “నాని అన్న నన్ను భరించాల్సిందే” అంటూ ఆయన చేసిన కామెంట్ ఇప్పుడు అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి..ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్యన క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని సోషల్ మీడియాలో బాగా వార్తలు వచ్చి వైరల్ అయ్యాయి.

అంతేకాదు, ఇద్దరు తిట్టుకున్నారని..బాగా సెట్స్‌లో అరుచుకున్నారని..వార్తలు ప్రసారం అయ్యాయి. దీనిపై, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల క్లారిటీ ఇచ్చాడు. అవును నాని అన్న నన్ను తిట్టాడు..నాకు కోపం వచ్చింది..నాని అన్న నా మీద అలిగాడు..ఇదంత మా ఇద్దరి ఎమోషన్. ఇది, ఇక దసరా సినిమాతోనో, ప్యారడైజ్ సినిమాతోనో ఆగిపోదు..ఎందుకంటే నాని అన్నతో నేను ఎప్పటికీ ఉంటాను.

ఇంకో సినిమా చేస్తాను..ఏం చేసినా నాని అన్నతోనే..ఆయనే నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చి డైరెక్టర్‌ని చేశాడు. కాబట్టి నాని అన్న నన్ను భరించాల్సిందే..తప్పదు..ఆయనకి ఇంకో ఆప్షన్ లేదు అంటూ చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి నాంతో శ్రీకాంత్ ఓదెలకి ఎలాంటి బాండింగ్ ఏర్పడిందో అర్థమవుతుంది. ఇక, ఈ ఈవెంట్‌లో శ్రీకాంత్ అన్న మాటలకి నాని నవ్వుతూనే ఉన్నాడు. మొత్తానికి, ప్యారడైజ్ కి డివైడ్ టాక్ వచ్చినా కూడా ఇప్పటికే, 120 కోట్ల వరకూ కలెక్షన్స్ వచ్చాయి. అదే సమయంలో కేటిర్ కూడా సినిమా చూస్తానని చెప్పడం మరో హైలెట్.

#nani#the paradise#srikanth odela#kayadu lohar#mohan babu#sampoornesh Babu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి