సినిమా

The Paradise: 2026 మొత్తం ప్యారడైజ్ గురించే మాట్లాడతారా? నాని అన్నదేంటి!

రచన: Anshu•••4 నిమిషాల పఠనం

The Paradise: గుడ్ నాయిస్, బ్యాడ్ నాయిస్ కాదు ఓన్లీ నాయిస్..అది ప్యారడైజ్ సినిమాకి వినిపిస్తోంది..ఈ 2026 మొత్తం వినిపించేది ప్యారడైజ్ సినిమా గురించే..అని తాజాగా జరిగిన ప్యారడైజ్ సినిమా సక్సెస్ ఈవెంట్‌లో హీరో నాని అన్నాడు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి మిక్స్ టాక్, డివైడ్ టాక్ వచ్చింది. సాధారణంగా ఇలాంటి టాక్ వచ్చాక మొత్తం సీన్ మారిపోతుంది.

కానీ, నాని సినిమాకి మాత్రం కలెక్షన్స్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతున్నాయి. ప్యారడైజ్ రిలీజ్ అయిన 2 రోజుల్లోనే 115 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వరకూ రాబట్టింది. మొదటి రోజు మేకర్స్‌కి కాస్త డివైడ్ టాక్ వల్ల డిసప్పాయింట్‌మెంట్ అనిపించినప్పటికీ, మెల్లగా కలెక్షన్ల జోరు చూసి నమ్మకం కలిగింది. ఎంత కాదన్న 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబడుతుందన్న ట్రేడ్ వర్గాల అంచనా నిజం చేసేలా ఉంది.

ఇక, ఈ సినిమాకి తాజాగా మేకర్స్ సక్సెస్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో నాని స్పీచ్ చైలెట్‌గా నిలిచింది. ప్రతీ ఒక్కరి గురించి నాని పేరు పేరునా థాంక్స్ చెప్పాడు. ముఖ్యంగా మోహన్ బాబు గురించి మాట్లాడుతూ..ఈ సినిమాకి హీరో నేనైతే నా పైనున్న హీరో మోహన్ బాబు గారు అని అన్నాడు. సంపూర్ణేష్ బాబు గురించి మాట్లాడాడు. ఇక, శ్రీకాంత్ ఓదెల గురించి కూడా నాని ఆసక్తికరంగా చెప్పాడు.

శ్రీకాంత్ ని అస్సలు పొగడను అని అన్నాడు. మా నాన్న నన్ను ఎలా కోప్పడతాడో..నేను శ్రీకాంత్ అని అలా కోప్పడతాను..అస్సలు ప్యాంపర్ చేయను..జున్ను(నాని కూతురు) నైనా ముద్దు చేస్తాను కానీ, శ్రీకాంత్ ని మాత్రం అసలు ప్యాంపర్ చేయను అన్నాడు. అంతేకాదు, ప్యారడైజ్ రిలీజైయ్యాక గుడ్ వాయిస్ విన్నాను..బ్యాడ్ వాయిస్ విన్నాను..బట్ గుడ్, బ్యాడ్ కాదు..వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. ఈ 2026 మొత్తం ప్యారడైజ్ సినిమా గురించే మాట్లాడుకుంటారు..అని అన్నాడు. ప్రస్తుతం, నాని అన్న మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

#nani#the paradise#kayadu lohar#srikanth odela#keerthy suresh
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి