తెలంగాణ

TG Safe: కొరడా ఝళిపించిన టీజీ సేఫ్.. 11 ప్రధాన హోటల్స్ లైసెన్స్ రద్దు

రచన: NK••3 నిమిషాల పఠనం

హైదరాబాద్ నగరంలో ఆహార భద్రతకు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించిన హోటల్స్ పై టీజీ సేఫ్ కొరడా ఝళిపించింది. 11 ప్రధాన హోటళ్ల లైసెన్స్ రద్దు చేసింది. మాదాపూర్, గచ్చిబౌలి పరిధిలోని పలు హోటళ్లు, రెస్టారెంట్స్ లో నాసిరకం ఆహార పదార్థాలను గుర్తించారు. వంట గదులు దుర్గంధపూరితంగా ఉన్నాయి. దీంతో టీజీ సేఫ్ అధికారులు సీరియస్ అయ్యారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న హోటళ్ల లైసెన్సులు రద్దు చేశారు.

TG Safe: హైదరాబాద్ నగరంలో ఆహార భద్రతకు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించిన హోటల్స్ పై టీజీ సేఫ్ కొరడా ఝళిపించింది. 11 ప్రధాన హోటళ్ల లైసెన్స్ రద్దు చేసింది. మాదాపూర్, గచ్చిబౌలి పరిధిలోని పలు హోటళ్లు, రెస్టారెంట్స్ లో నాసిరకం ఆహార పదార్థాలను గుర్తించారు. వంట గదులు దుర్గంధపూరితంగా ఉన్నాయి. దీంతో టీజీ సేఫ్ అధికారులు సీరియస్ అయ్యారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న హోటళ్ల లైసెన్సులు రద్దు చేశారు.

మాదాపూర్‌, గచ్చిబౌలిలోని పలు హోటల్స్‌, రెస్టారెంట్లలో టీజీ సేఫ్‌ అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో నాసిరకం ఆహార పదార్ధాలు వాడుతున్నట్లు గుర్తించారు. కుళ్లిన మాంసం, ఎక్స్ పైరీ అయిన ఫుడ్ ఐటెమ్స్, సింథటిక్ ఫుడ్ కలర్స్, రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్ కనుగొన్నారు. ఇక ఆహార పదార్ధాలు తయారు చేసే కిచెన్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఎంతో అపరిశుభ్రంగా ఉన్నాయి. అందులో ఈగలు, బొద్దింకలు కనిపించాయి. ఈ క్రమంలో పదకొండు ప్రముఖ హోటల్స్‌ ఫుడ్‌ లైసెన్స్‌లు రద్దు చేసింది టీజీ సేఫ్.

హైటెక్‌ సిటీ

* మొనాస్ట్రీ, కోల్ స్పార్క్ రెస్టారెంట్‌

* కాంచి కేఫ్‌

గచ్చిబౌలి

* శివాణి బార్ అండ్ రెస్టారెంట్‌

* అల్‌సబా రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు

* ఉడిపీస్ ఉపహార్

* అంటెరా కిచెన్ అండ్ బార్ లైసెన్స్‌లు రద్దు

మాదాపూర్‌

* లక్కీ రెస్టారెంట్

* సాయిరామ్‌ మెస్‌

* ఇనార్బిట్ మాల్‌లోని అమ్ ఆహా తెలుగు కిచెన్ అండ్ బార్ లైసెన్స్ రద్దు

* మాదాపూర్ ఇనార్బిట్ మాల్‌లోని ఫ్యూజన్9, అమ్నీషియా స్కై బార్ లైసెన్స్ రద్దు

#TG Safe#Hotels#Restaurants#Telangana#Hyderabad#Licenses Cancelled#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి