National

ATM: సమ్మె టైంలో ఏటీఎం బాదుడు బంద్.. కస్టమర్ల కోసం ప్రత్యేక వెసులుబాటు!

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

ATM: వారంలో అయిదు పనిదినాలు అమలు చేయాలంటూ ప్రభుత్వ రంగ బ్యాంకుల సిబ్బంది చేపడుతున్న సమ్మె నేపథ్యంలో ఖాతాదారులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం వెలువడింది. ఈ నెల 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోయే ప్రమాదం ఉండటంతో, ఖాతాదారులు నగదు కష్టాలు పడకుండా ఉండేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ఇతర జాతీయ బ్యాంకులు ప్రత్యేక సడలింపులను ప్రకటించాయి.

ATM: వారంలో అయిదు పనిదినాలు అమలు చేయాలంటూ ప్రభుత్వ రంగ బ్యాంకుల సిబ్బంది చేపడుతున్న సమ్మె నేపథ్యంలో ఖాతాదారులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం వెలువడింది. ఈ నెల 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోయే ప్రమాదం ఉండటంతో, ఖాతాదారులు నగదు కష్టాలు పడకుండా ఉండేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ఇతర జాతీయ బ్యాంకులు ప్రత్యేక సడలింపులను ప్రకటించాయి. సమ్మె కాలంలో ఎలాంటి ట్రాన్సాక్షన్ ఫీజులు లేకుండా ఏటీఎంలను ఫ్రీగా వాడుకునేందుకు పచ్చజెండా ఊపాయి.

నో చార్జెస్.. దేశవ్యాప్తంగా ఏ ఏటీఎంలోనైనా ఫ్రీ విత్‌డ్రా

సమ్మె కొనసాగే ఆ మూడు రోజులు సామాన్యులపై పైసా భారం పడకుండా ప్రభుత్వ బ్యాంకులు తీసుకున్న ప్రధాన నిర్ణయాలు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు ఏటీఎం సెంటర్ నుంచి డబ్బులు డ్రా చేసుకున్నా ఎలాంటి చార్జీలు వర్తించవు. సాధారణంగా ఉండే లావాదేవీల పరిమితితో సంబంధం లేకుండా ఉచితంగా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. సొంత బ్యాంకు ఏటీఎంలే కాకుండా, ఇతర బ్యాంకుల ఏటీఎంలను యూజ్ చేసిన అదనపు ఫీ ఉండదు. నగదు కొరత రాకుండా ఉండేందుకు ఏటీఎంలు, కస్టమర్ సేవా కేంద్రాలను ఉపయోగించుకోవాలని, పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసేవారు యూపీఐ (UPI), నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్ యాప్స్, ఐఎంపీఎస్‌, నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్‌ మార్గాల ద్వారా లావాదేవీలు నడుపుకోవాలని బ్యాంకర్లు సూచించారు.

ఈ ఆదివారమే (సెప్టెంబర్ 27) బ్యాంకు పనులు చక్కబెట్టుకోండి

ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల ముగింపు సమయంలో బ్యాంకులు బంద్ కావడం వల్ల వ్యాపారాలు, ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో కేంద్ర ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. సిబ్బంది కోరుతున్న 5 రోజుల పనిదినాల విజ్ఞప్తిపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. రాబోయే మూడు రోజుల సమ్మె వల్ల శాఖాపరమైన సేవలకు ఆటంకం కలగకుండా, ఈ నెల 27వ తేదీ (ఆదివారం) బ్యాంకు శాఖలన్నీ తెరిచే ఉంచాలని ఆదేశించింది. బ్యాంకు బ్రాంచీలకు స్వయంగా వెళ్లి చేసుకోవాల్సిన అత్యవసర లావాదేవీలు ఉన్నవారు ఆదివారమే వాటిని పూర్తి చేసుకోవాలని మేనేజ్‌మెంట్లు స్పష్టం చేశాయి.

అక్టోబర్ 1 నుంచి ఎస్‌బీఐ కస్టమర్లపై కొత్త మోత

సమ్మె సమయంలో ఉపశమనం కల్పించినప్పటికీ, అక్టోబర్ 1వ తేదీ నుంచి ఎస్‌బీఐ తన ఖాతాదారులకు నిబంధనల భారం మోపనుంది. జీతాల ఖాతాదారులకు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు అందుబాటులో ఉన్న 10 ఉచిత లావాదేవీల అవకాశాన్ని 5కి తగ్గించింది. ఆ పరిమితి ముగిశాక చేసే ప్రతి విత్‌డ్రాయల్‌పై రూ.23తో పాటు జీఎస్‌టీ, నాన్-ఫైనాన్షియల్ లావాదేవీలకు రూ.11తో పాటు జీఎస్‌టీ వసూలు చేయనుంది. సమ్మె రోజుల్లో ఏటీఎంలపై ఫీ లేకపోవడం మంచి వెసులుబాటే అయినప్పటికీ, పనులు ఉన్నవారు ఆదివారం అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ముందుగానే పనులు పూర్తి చేసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.

#Bank Strike#ATM Charges#ATM Withdrawal#Bank Employees Strike#Public Sector Banks#SBI#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి