తెలంగాణ

మాట తప్పిన రేవంత్ రెడ్డి.. జర్నలిస్టుల జీవితాలతో చెలగాటం.. పేట్ బషీరాబాద్ స్థలం "గురుకుల" పాఠశాలకు

రచన: NK•••5 నిమిషాల పఠనం

సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారు. 13 కోట్లు కట్టిన జర్నలిస్టుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. పేట్ బషీరాబాద్ సర్వే నెంబర్ 25/2 లో JNJHS కు (జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి) 2008లో కేటాయించిన స్థలాన్ని ప్రభుత్వం ఇటీవలే గురుకుల పాఠశాల నిర్మాణానికి కేటాయించినట్లు బయటపడింది.

* మాట తప్పిన రేవంత్ రెడ్డి..

* పేట్ బషీరాబాద్ స్థలం "గురుకుల" పాఠశాలకు కేటాయింపు

* జేఎన్ జే హెచ్ ఎస్ సభ్యుల నెత్తిన పిడుగు

* పోలీస్ బందోబస్తు కోసం రెవెన్యూ అధికారుల ఆదేశాలు

* నిర్మాణాలు అడ్డుకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక

* 13 కోట్లు కట్టిన జర్నలిస్టుల జీవితాలతో చెలగాటం

Petbasheerabad Land: సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారు. 13 కోట్లు కట్టిన జర్నలిస్టుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. పేట్ బషీరాబాద్ సర్వే నెంబర్ 25/2 లో JNJHS కు (జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి) 2008లో కేటాయించిన స్థలాన్ని ప్రభుత్వం ఇటీవలే గురుకుల పాఠశాల నిర్మాణానికి కేటాయించినట్లు బయటపడింది.

పోలీస్ బందోబస్తు నడుమ నిర్మాణాలు!

ఈ స్థలంలో గురుకుల పాఠశాల నిర్మాణానికి కొడంగల్ నుంచి వర్చువల్ గా శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు. వెంటనే సంబంధిత అధికారులు పేట్ బషీరాబాద్ స్థలంలో గురుకుల పాఠశాల నిర్మాణానికి పూనుకున్నారు. అయితే, అక్కడున్న ముస్లింలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక రెవెన్యూ అధికారులు నిర్మాణాలను సజావుగా జరిపించేందుకు పోలీస్ బందోబస్తు ఇవ్వాలని పోలీసు అధికారులను కోరారు.

ఎట్టి పరిస్థితుల్లో గురుకుల పాఠశాల నిర్మించాలని ఆదేశాలు

ఇటీవల ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో కూడా ఎట్టి పరిస్థితిలో పేట్ బషీరాబాద్ లో గురుకుల పాఠశాల నిర్మించి తీరాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించినట్లు రెవెన్యూ అధికారుల నుంచి విశ్వసనీయ సమాచారం అందింది.

స్వయంగా ముఖ్యమంత్రి దీనిపై దృష్టి పెట్టడంతో అధికారులంతా గురుకుల పాఠశాల నిర్మాణానికి సంబంధించి ఎలాంటి అడ్డంకులు వచ్చినా క్లియర్ చేసే విధంగా సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, ముస్లిం వర్గాలు అడ్డుకోవడంతో తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ విషయమై జే ఎన్ జే డైరెక్టర్లు పివి రమణ రావు, అశోక్ రెడ్డి సంబంధిత రెవెన్యూ అధికారుల నుంచి కూపీ లాగడంతో విషయమంతా బయటపడింది

కింకర్తవ్యం..?

జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన ప్రైమ్ ల్యాండ్ ను ప్రభుత్వం లాగేసుకోవడంపై సభ్యుల కింకర్తవ్యం ఏమిటి అనే విషయంపై తీవ్రంగా ఆలోచన చేస్తుంది. దశలవారీగా ఉద్యమం చేపట్టాలని Team JNJ నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా..

అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టడం.

విస్తృతంగా సోషల్ మీడియాను ఏర్పాటు చేసుకోవడం.

ఇచ్చిన మాట తప్పిన ప్రభుత్వంపై పోరు అనివార్యం.

ఇప్పటికే ఈ స్థలాల అంశంపై Team JNJ తరపున నిజాంపేటలో భూముల స్వాధీనం కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేపడుతుంది.

పెద్దఎత్తున సభ్యులంతా తరలివచ్చి మన స్థలాలు మనం స్వాధీనం చేసుకుందాం..

రండి.. కదలిరండి...

ఇంతకంటే ఇంకా పోయేదేమీ లేదు..

అంతా శూన్యమైంది..

ఆఖరి పోరాటానికి సిద్ధమవుదాం ..

భయాన్ని వీడుదాం...

ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దాం...

స్థలాలు సాధించుకుందాం..

మీ..

పివి రమణ రావు

9849998093

కె.అశోక్ రెడ్డి

9603322489

సొసైటీ డైరెక్టర్లు

Team JNJ

#Cm Revanth Reddy#Petbasheerabad#Gurukul School#Petbasheerabad Land#Journalists#JNJ#Jawahar Lal Nehru Journalist Housing Society#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి