Spirituality

Spirituality: మహాలయ పక్షంలో ఈ 9 తప్పులు మాత్రం అస్సలు చేయకండి!

రచన: Venu••4 నిమిషాల పఠనం

మాకు పద్ధతులు తెలియవు అని శ్రాద్ధ కర్మలను అలక్ష్యం చేయడం సరికాదు. కనీసం నల్ల నువ్వులు, నీటితో అర్ఘ్యం ఇచ్చి, కాకులకు అన్నం పెట్టినా పితృరుణం కొంతైనా తీరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

సంవత్సరంలో పితృ దేవతలకు అత్యంత పవిత్రమైన రోజులు మహాలయ పక్షాలు. మన మూలాలను, మనల్ని ఈ లోకంలోకి తెచ్చిన మన పూర్వీకులను స్మరించుకుని, వారి ఆశీస్సులు పొందే అత్యంత ప్రాశస్త్యమైన సమయం ఇది. అయితే, ఈ పవిత్ర దినాలలో తెలియక చేసే కొన్ని పొరపాట్లు పితృదేవతల ఆగ్రహానికి, పితృదోషాలకు కారణమవుతాయని పండితులు చెబుతున్నారు. అందుకే, ఈ మహాలయ పక్షంలో అస్సలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్న ఆ 9 ముఖ్యమైన తప్పులేంటో తెలుసుకుందాం.

మొదటిది, ఈ రోజుల్లో నూతన వస్త్రాలు, వాహనాలు, బంగారం కొనడం లేదా కొత్త ఇల్లు మారడం వంటివి చేయకూడదు, అలాగే ఎలాంటి శుభకార్యాల ముహూర్తాలు కూడా నిర్ణయించకూడదు... రెండవది, ఆహార విషయంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసాహారం, మద్యం, పొగాకు ఉత్పత్తులకు పూర్తిగా దూరంగా ఉంటూ కేవలం సాత్వికాహారాన్ని మాత్రమే స్వీకరించాలి. మూడవది, పితృ పక్ష దినాలలో గడ్డం, జుట్టు కత్తిరించుకోవడం లేదా గోళ్లు తీయడం ఆచార విరుద్ధం..

నాలుగవది, పితృ తర్పణాలు లేదా శ్రాద్ధ కర్మలను మధ్యాహ్నం వేళ 'కుతుప కాలం'లోనే నిర్వర్తించాలి తప్ప సూర్యాస్తమయం తర్వాత లేదా రాత్రి వేళల్లో తర్పణాలు ఇవ్వడం నిషిద్ధం.. ఐదవది, మీ ఇంటికి వచ్చే యాచకులను, సాధువులను ఖాళీ చేతులతో పంపకూడదు. ముఖ్యంగా ఆవులు, కాకులు, కుక్కలను పితృదేవతల స్వరూపాలుగా భావించి వాటికి ఆహారం అందించాలే తప్ప తరిమేయకూడదు.

ఆరవది, పితృ కర్మలలో లేదా దానాలలో ఇనుము, ప్లాస్టిక్ పాత్రలను వాడకూడదు; కేవలం ఇత్తడి, రాగి, వెండి లేదా విస్తరాకులను మాత్రమే ఉపయోగించాలి. ఏడవది, ఈ రోజుల్లో ఇంట్లో వివాదాలు లేకుండా చూసుకోవాలి, అలాగే అబద్ధాలు చెప్పడం చేయకూడదు. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే పితృదేవతలకు ఆత్మశాంతి లభిస్తుంది. ఇక ఎనిమిదవది, ఈ పదిహేను రోజులు సంపూర్ణ బ్రహ్మచర్యం పాటిస్తూ మానసిక, శారీరక శుద్ధిని కాపాడుకోవాలి.

తొమ్మిదవది, మాకు పద్ధతులు తెలియవు అని శ్రాద్ధ కర్మలను అలక్ష్యం చేయడం సరికాదు. కనీసం నల్ల నువ్వులు, నీటితో అర్ఘ్యం ఇచ్చి, కాకులకు అన్నం పెట్టినా పితృరుణం కొంతైనా తీరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ మహాలయ పక్షంలో ఈ 9 నియమాలను నిష్టతో పాటిస్తూ, మన పూర్వీకులను భక్తిశ్రద్ధలతో స్మరించుకుందాం.

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.

#Spirituality#Mahalaya Paksha#Ancestors#ancestral spirits#wrath#Pitru Doshas#scriptures#9 mistakes
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి