Health

Health: షుగర్ కంట్రోల్‌కు అద్భుతమైన ఔషదం.. ఇది ఎంతవరకు పనిచేస్తుందంటే?..

రచన: Venu•••4 నిమిషాల పఠనం

డయాబెటిస్ అనేది నేటి కాలంలో సాధారణంగా మారింది. ఒత్తిడితో కూడిన లైఫ్, నియంత్రణలో లేని అలవాట్ల వల్ల రోజు రోజుకు డయాబెటిస్ పేషెంట్స్ పెరుగుతున్నారు.

డయాబెటిస్ అనేది నేటి కాలంలో సాధారణంగా మారింది. ఒత్తిడితో కూడిన లైఫ్, నియంత్రణలో లేని అలవాట్ల వల్ల రోజు రోజుకు డయాబెటిస్ పేషెంట్స్ పెరుగుతున్నారు. అయితే షుగర్ వ్యాధిని కంట్రోల్ ల్లో ఉంచడానికి ఆరోగ్యనిపుణులు మనింట్లోని వంటింట్లో దొరికే వస్తువుల గురించి చెప్పడం తెలిసిందే.. అలాంటి వాటిలో కసూరి మేతి ఒకటి. ఇక రోజువారీ వంటల్లో రుచి, సువాసన కోసం ఉపయోగించే కసూరి మేతి.. అంటే ఎండిన మెంతి ఆకులు.

ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కొంతమేర సహాయపడే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. మెంతిలో ఫైబర్‌తో పాటు కొన్ని బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదించడం ద్వారా భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ ఒక్కసారిగా పెరగకుండా కొంతమేర సహాయపడవచ్చు.

మెంతి గింజలపై జరిగిన కొన్ని అధ్యయనాల్లో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించే గుణాలు ఉన్నట్టు తేలిందట.. అయితే కసూరి మేతి ప్రత్యేకంగా మధుమేహానికి చికిత్స చేస్తుందని నిర్ధారించే బలమైన ఆధారాలు మాత్రం ప్రస్తుతం లేవు. అందుకే కసూరి మేతిని కూరలు, పుల్కాలు, పప్పులు వంటి సాధారణ ఆహారాల్లో పరిమితంగా చేర్చుకోవచ్చు. అయితే మధుమేహం ఉన్నవారు తమ ఆహారంలో మార్పులు చేసుకునే ముందు వైద్యుడిని లేదా డైటీషియన్ సలహా తీసుకోవడం మంచిదని అంటున్నారు.

మరోవైపు కసూరి మేతి లేదా మెంతి తీసుకుంటున్నామని చెప్పి మధుమేహ మందులను స్వయంగా ఆపకూడదు. శాస్త్రీయ ఆధారాలు లేని ఏ ఆహార పదార్థాన్నీ మధుమేహానికి ప్రత్యామ్నాయ చికిత్సగా ఉపయోగించవద్దని నిపుణుల మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. అలాగే ఎక్కువ మోతాదులో మెంతి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర మరీ తగ్గడం, విరేచనాలు, వికారం వంటి సమస్యలు రావచ్చు. మధుమేహ మందులు వాడుతున్నవారు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీలు ఆహారంలో ఉండే సాధారణ పరిమాణం కంటే ఎక్కువగా మెంతిని తీసుకోకూడదు.

అందువల్ల కసూరి మేతిని అద్భుతమైన షుగర్‌ నివారణగా కాకుండా.. సమతుల్య ఆహారంలో భాగంగా చూడటం సరైన విధానం. మధుమేహ నియంత్రణకు సరైన ఆహారం, వ్యాయామం, బరువు నియంత్రణ, వైద్యుల సూచన మేరకు మందులు వాడటమే ఉత్తమం అని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..

#Health#blood sugar#remedy#control#Kasuri Methi#Fiber
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి