తెలంగాణ

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో కేటీఆర్ సందడి.. బీఆర్ఎస్ నేతలతో కలిసి 'ది ప్యారడైజ్' వీక్షణం!

రచన: Mamatha puppala••5 నిమిషాల పఠనం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సందడి చేశారు. ఆయిన స్థానిక సుదర్శన్ థియేటర్‌కు వెళ్లి, నాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పీరియడ్ యాక్షన్ చిత్రం 'ది ప్యారడైజ్'ను ప్రత్యేకంగా వీక్షించారు. చాలా కాలం తర్వాత థియేటర్‌లో సినిమా చూడటానికి వెళ్తున్నానని కేటీఆర్ ముందే సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో థియేటర్ ప్రాంగణంలో అభిమానులు, కార్యకర్తలు భారీగా సమకూరారు.

 సినిమా ప్రారంభానికి ముందు కేటీఆర్ తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేస్తూ, ‘చాలా సంవత్సరాల తర్వాత థియేటర్‌కు వెళుతున్నాను. నాకు అత్యంత ఇష్టమైన నటులలో ఒకరైన నాని, ఎంతో ప్రతిభావంతుడైన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన 'ది ప్యారడైజ్' చిత్రాన్ని పెద్ద తెరపై చూడటానికి వెళ్తున్నాను’ అని పేర్కొన్నారు. థియేటర్‌కు చేరుకున్న కేటీఆర్‌కు థియేటర్ యాజమాన్యం, అభిమానులు ఘన స్వాగతం పలికారు.

 ఈ సినిమా వీక్షణ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు భాగస్వాములయ్యారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, అలాగే హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తదితర నాయకులు కేటీఆర్‌తో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఈ చిత్రాన్ని తిలకించారు. నేతల రాకతో థియేటర్ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

 శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ విడుదలైన 'ది ప్యారడైజ్' చిత్రంలో నాని, మోహన్ బాబు, కయాదు లోహర్, సోనాలి కులకర్ణి కీలక పాత్రలు పోషించారు. అయితే, ఈ చిత్రంలో నటుడు ప్రియదర్శి పోషించిన 'ఎమ్మెల్యే శంకరన్న' పాత్ర రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆ పాత్ర రూపురేఖలు, శైలి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పోలి ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాలు, విశ్లేషకుల్లో వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ థియేటర్‌కు వచ్చి స్వయంగా ఈ సినిమా చూడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

 ఈ చిత్రాన్ని వీక్షించిన అనంతరం కేటీఆర్ చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఒక సమాజం అణచివేతకు గురైనప్పుడు తన అస్తిత్వం కోసం చేసే పోరాటాన్ని, న్యాయం కోసం గళమెత్తే తీరుని సినిమాలో అద్భుతంగా ఆవిష్కరించారని కొనియాడారు. ఆయన, ఈ అస్తిత్వ పోరాటాన్ని ఒక అద్భుతమైన దృశ్యకావ్యంగా మలచిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, హీరో నానితో పాటు చిత్ర నిర్మాణ బృందానికి తన ప్రత్యేక అభినందనలు తెలిపారు.

#KTRAtRTSCrossRoads#TheParadiseMovie#NaniSrikanthOdela#SudarshanTheatre#BRSLeaders#TelanganaNews#CinemaTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి