OG 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది పండుగ లాంటి వార్త. యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా 'ఓజీ2' నుంచి వచ్చిన లేటెస్ట్ అప్‌డేట్. పవన్ కళ్యాణ్-సుజీత్ కాంబినేషన్‌లో వచ్చిన ఓజీ ఎలాంటి సంచలన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు, ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తుండగా.. ఇందుకోసం పవన్ కళ్యాణ్ అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ 70 రోజుల కాల్ షీట్స్ ఇచ్చేందుకు ఓకే చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం, పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో ఓజీ సినిమా సీక్వెల్ కోసం పవర్ స్టార్ 70 రోజుల పాటు సమయం కేటాయించడం టాలీవుడ్ సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది. 'ఓజీ 2' స్క్రిప్ట్ ఆల్రెడీ లాక్ అయింది. సుజీత్ ఇమేజస్‌తో సహా డిజైన్ చేసిన ఈ స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్‌ను బాగా ఆకట్టుకుంది. పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో, పవర్ స్టార్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్లుగా పవర్ ఫుల్ పాయింట్‌తో తెరకెక్కన్న సినిమా, ఫస్ట్ పార్ట్ తోనే 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి..ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
ఇక, సుజీత్ మేకింగ్ స్టైల్ తో పాటుగా కథాంశం మీదున్న బలమైన నమ్మకంతోనే పవన్ కళ్యాణ్ పార్ట్-2 కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ముఖ్యంగా సీక్వెల్ లో యాక్షన్ సన్నివేశాలు, మేకింగ్ విజువల్స్ అన్నీ హాలీవుడ్ రేంజ్‌లో ఉండబోతున్నాయి. పవన్ కళ్యాణ్ 20 నుంచి 30 రోజులు డేట్స్ ఇస్తేనే బాక్సాఫీస్ షేకయ్యే సినిమా తీసిన సుజీత్..ఏకంగా 70 రోజుల డేట్లు ఇస్తే పార్ట్-2 ను సుజీత్ ఇంకెలాంటి విజువల్ వండర్‌గా తయారు చేస్తాడో ఊహించుకోవచ్చు.
ఇక, ఓజీ 2 కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేసిన భారీ సెట్లలో మేయిన్ సీన్స్‌ను చిత్రీకరించేందుకు ప్రొడక్షన్ టీమ్ ఏర్పాట్లు పూర్తి చేస్తోందట. అంతేకాదు, పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ బేస్ చేసుకొని మిగతా యాక్టర్స్‌తో షెడ్యూల్స్ డిజైన్ చేయనున్నారు. మొత్తానికి, ఇటు రాజకీయాల్లో పవర్ ఫుల్ లీడర్‌గా బిజీగా ఉన్న పవన్, ఇటు వెండితెరపై కూడా తన మార్క్ పవర్ చూపించడానికి సమయం ఇస్తుండటం విశేషం. మరి, ఓజీ 2 సెట్స్‌పైకి ఎప్పుడు వస్తుందో..చూడాలి.









