తెలంగాణ

Jagadish Reddy: విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు ప్రభుత్వం కుట్ర- జగదీశ్ రెడ్డి సంచలన ఆరోపణలు

రచన: NK••3 నిమిషాల పఠనం

విద్యుత్ రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేసే కుట్రకు రాష్ట్ర ప్రభుత్వం తెర లేపిందని మాజీమంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. లాభాల్లో ఉన్న ట్రాన్స్ కో సంస్థను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్లాన్ ప్రభుత్వం చేస్తోందన్నారు. విద్యుత్ ను ప్రైవేట్ పరం చేస్తే రాష్ట్రం బాగుపడదన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని జగదీశ్ రెడ్డి హెచ్చరించారు. రేవంత్ సర్కార్ భూములను సైతం అమ్ముకుంటోందని ఆయన మండిపడ్డారు.

Jagadish Reddy: విద్యుత్ రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేసే కుట్రకు రాష్ట్ర ప్రభుత్వం తెర లేపిందని మాజీమంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. లాభాల్లో ఉన్న ట్రాన్స్ కో సంస్థను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్లాన్ ప్రభుత్వం చేస్తోందన్నారు. విద్యుత్ ను ప్రైవేట్ పరం చేస్తే రాష్ట్రం బాగుపడదన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని జగదీశ్ రెడ్డి హెచ్చరించారు. రేవంత్ సర్కార్ భూములను సైతం అమ్ముకుంటోందని ఆయన మండిపడ్డారు.

''విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు రేవంత్ సర్కార్ కుట్ర చేస్తోంది. లాభాల్లో ఉన్న ట్రాన్స్ కోను వాళ్లకు ఇష్టమైన వాళ్లకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాన్స్ కో ను ఎందుకు ప్రైవేట్ వాళ్లకి ఇవ్వాలి? ఏం అవసరం వచ్చింది? ట్రాన్స్ కో లాభాల్లోనే ఉంది. అవసరమైనప్పుడు డిస్కంలకు కూడా సాయం చేస్తోంది.

అలాంటి ట్రాన్స్ కోను తన దోస్తులకు కట్టబెట్టేందుకు రేవంత్ చేస్తున్న కుట్ర ఈ ప్రైవేటీకరణ. మనిషి శ్వాస తీసుకోవడం ఎంత అవసరమో ఇవాళ విద్యుత్ కూడా అంతే అవసరం. ప్రజల జీవితంలో భాగమైపోయింది. అటువంటి దాన్ని ప్రైవేట్ వాళ్ల చేతికి ఇస్తే ప్రజల ఊపిరి ఆగిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలి. ప్రైవేటీకరణకు బీఆర్ఎస్ అంగీకరించదు. ట్రాన్స్ కో ఉద్యోగులు, ప్రజలతో కలిసి పోరాటం చేసి ప్రైవేటీకరణను ఆపేందుకు ప్రయత్నం చేస్తాం'' అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.

#Jagadish Reddy#Brs#Power Sector#Privatisation#Cm Revanth Reddy#Transco#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి