క్రీడలు

VIRAL: మైదానంలోనే కంటతడి పెట్టుకున్న హర్మన్‌ప్రీత్!

రచన: Mamatha puppala•••4 నిమిషాల పఠనం

భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) ఎట్టకేలకు తన సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ అద్భుతమైన ఫామ్‌లోకి వచ్చింది. గత కొంతకాలంగా వరుస వైఫల్యాలతో పరుగుల కోసం తీవ్రంగా ఇబ్బంది పడిన ఆమె.. తాజాగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో అజేయ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయింది.

భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) ఎట్టకేలకు తన సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ అద్భుతమైన ఫామ్‌లోకి వచ్చింది. గత కొంతకాలంగా వరుస వైఫల్యాలతో పరుగుల కోసం తీవ్రంగా ఇబ్బంది పడిన ఆమె.. తాజాగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో అజేయ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయింది. కేవలం 41 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో విధ్వంసకరంగా ఆడి ఏకంగా 91 పరుగులు సాధించింది.

 అయితే, మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. గత 10 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లు ఆడినా ఒక్క అర్ధశతకం సైతం సాధించకపోవడం, కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత వ్యక్తిగత ప్రదర్శన నిరాశపరచడంతో ఆమెపై మానసిక ఒత్తిడి తీవ్రస్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేపై ఆడిన ఈ సూపర్‌ ఇన్నింగ్స్ ఆమెకు ఎంతో మానసిక ఉపశమనాన్నిచ్చింది.

 ఇన్నింగ్స్ విరామ సమయంలో బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడుతూ.. ‘చాలా సంతోషంగా ఉంది.. క్రీజులో సమయం గడపడాన్ని, నా బ్యాటింగ్‌ను పూర్తిగా ఆస్వాదించాలనుకున్నాను’ అని హర్మన్‌ప్రీత్ ఆనందం వ్యక్తం చేసింది. మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్‌తో (WV Raman) మాట్లాడుతుండగానే ఆమె ఒక్కసారిగా భావోద్వేగంతో కంటతడి పెట్టింది. ‘‘ఈ విజయక్రమంలో మీకు కూడా భాగం ఉంది. జట్టులోకి రాగానే ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా నీకు నచ్చినట్లు స్వేచ్ఛగా ఆడు' అని మీరు చెప్పారు. నేను సరిగ్గా అదే చేశాను" అంటూ రామన్ అందించిన ధైర్యాన్ని గుర్తుచేసుకుంది.

 అంతేకాకుండా తన పునరాగమనం వెనుక ఉన్న కష్టాన్ని పంచుకుంటూ.. ‘ఆసియా క్రీడలు ముగిసిన తర్వాత నెట్స్‌లో గంటల తరబడి చాలా కష్టపడ్డాను. నా బ్యాటింగ్‌లోని లోపాలను సరిదిద్దడానికి ఎంతో శ్రమించిన నా వ్యక్తిగత కోచ్ హిమాన్షు భయ్యాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి’ అని హర్మన్‌ప్రీత్ పేర్కొన్నారు. మొత్తానికి ఆమె తిరిగి ఫామ్‌లోకి రావడం భారత మహిళా క్రికెట్ జట్టుకు ఎంతో ఊరటనిచ్చే పరిణామం.

 

#HarmanpreetKaur#HarmanpreetKaurCrying#HarmanpreetKaurEmotional#WVRaman#IndiaVsZimbabweT20#IndianWomenCricket#HarmanpreetFormComeback#SportsNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి