National

SBI : సైబర్ అటాక్..డార్క్‌వెబ్‌లో ఎస్‌బీఐ ఖాతాదారుల డేటా లీక్!

రచన: Kumar••4 నిమిషాల పఠనం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు బిగ్ షాక్ తగిలింది. బ్యాంకు ఖాతాదారుల వివరాలకు సంబంధించిన పోర్టల్‌పై సైబర్ అటాక్ జరిగినట్టు తెలిసింది.ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం ధృవీకరించింది. ఎస్బీఐ ఖాతాదారుల వివరాలు డార్క్ వెబ్‌లో దర్శనం ఇచ్చినట్టు సమాచారం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు బిగ్ షాక్ తగిలింది. బ్యాంకు ఖాతాదారుల వివరాలకు సంబంధించిన పోర్టల్‌పై సైబర్ అటాక్ జరిగినట్టు తెలిసింది.ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం ధృవీకరించింది. ఎస్బీఐ ఖాతాదారుల వివరాలు డార్క్ వెబ్‌లో దర్శనం ఇచ్చినట్టు సమాచారం. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 3,897 ఎస్బీఐ ఖాతాదారుల వివరాలు ప్రస్తుతం డార్క్ వెబ్‌లో అందుబాటులో ఉన్నట్టు తెలిసింది.

3,897 కస్టమర్ల పేర్లు, సెల్ నంబర్లు, పుట్టిన తేదీలు, ఈ-మెయిల్, ఇంటి చిరునామాలు, బ్రాంచ్ వివరాలు, CIF ఐడీలు, లోన్ రికార్డులు డార్క్‌వెబ్‌లో బహిర్గతం అయినట్టు ఎస్బీఐ బ్యాంకు ఓ అధికారిక నోట్ విడుదల చేసింది. అయితే, బ్యాంక్ ప్రధాన కార్యకలాపాలకు లేదా లావాదేవీలకు ఎలాంటి అంతరాయం కలగలేదని, పూర్తి దర్యాప్తు కోసం ఒక స్వతంత్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీని నియమించినట్టు ఎస్బీఐ ప్రకటించింది.

SBI : సైబర్ అటాక్..డార్క్‌వెబ్‌లో ఎస్‌బీఐ ఖాతాదారుల డేటా లీక్!

ఈ విషయం తెలియడంతో ఎస్బీఐ బ్యాంకులో ఖాతాలు ఉన్నవారు ఆందోళనకు గురవుతున్నారు. ఆ మూడు వేల మందిలో తమ వివరాలు ఉన్నాయా? లేదా? అని ఆందోళన చెందుతున్నారు.ఈ క్రమంలోనే ఎస్బీఐ తమ ఖాతాదారులకు కీలక అడ్వైజరీ జారీ చేసినట్టు సమాచారం. ఖాతాదారులు ఓటీపీ, ఏటీఎం పిన్ నంబర్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ లేదా సీవీవీ నంబర్లను ఎవరికీ చెప్పవద్దని సూచించింది. బ్యాంకు అధికారుల పేరుతో వచ్చే అనుమానాస్పద ఫోన్ కాల్స్ లేదా లింక్స్‌ను క్లిక్ చేయవద్దని హెచ్చరించింది.

బ్యాంక్ ఖాతా లావాదేవీలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని, అనుమానం కలిగితే వెంటనే సమీపంలోని బ్యాంకు సంప్రదించాలని సూచించింది. సైబర్ దాడుల నేపథ్యంలో ఇప్పటికే ఖాతాదారులు ఏదైనా మెసేజ్, లింక్స్ వస్తే జంకుతున్నారు. తాజాగా ఖాతా వివరాలు లీక్ అయ్యాయని తెలియడంతో తమ కష్టార్జితాన్ని దొంగలు దోచుకుపోయే అవకాశం ఉందని భయాందోళనకు గురవుతున్నారు.

#SBI#account holders#Data leak#cyberattcak#india#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి