తెలంగాణ

Congress : బీసీ సీఎంపై మాట మార్చిన పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

రచన: Kumar••4 నిమిషాల పఠనం

రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తరపున బీసీ నేత ముఖ్యమంత్రి అవుతారని గత కొంతకాలంగా చెబుతూ వచ్చిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఒక్కసారిగా మాట మార్చారు. ఇప్పుడు బీసీ లీడర్ ముఖ్యమంత్రి కావడానికి తొందర ఏమీ లేదన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నారు.

రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తరపున బీసీ నేత ముఖ్యమంత్రి అవుతారని గత కొంతకాలంగా చెబుతూ వచ్చిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఒక్కసారిగా మాట మార్చారు. ఇప్పుడు బీసీ లీడర్ ముఖ్యమంత్రి కావడానికి తొందర ఏమీ లేదన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నారు. పీసీసీ చీఫ్ ఇలా రెండు రెండు మాటలు మాట్లాడితే కాంగ్రెస్, ఆ పార్టీ నేతలను ఎలా నమ్మాలని కొందరు ప్రశ్నిస్తున్నారు.

తాజాగా ఓ యూట్యూబ్ చానల్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు, సీఎం రేవంత్ పరిపాలన చూస్తుంటే 2034 వరకే కాదు, 2039 వరకు కూడా తామే అధికారంలో ఉంటామని జోస్యం చెప్పారు. భవిష్యత్‍లో ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా బీసీ నేత సీఎం అవుతారని, ఇది కాంగ్రెస్ వల్లే సాధ్యం అవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము గెలిస్తే అప్పుడు కూడా రేవంత్ రెడ్డి సీఎం అవుతారన్నారు. కానీ, భవిష్యత్‍లో మాత్రం బీసీ వ్యక్తి తప్పకుండా సీఎం అవుతారని పేర్కొన్నారు.

ఆ పార్టీలతో సాధ్యం కాదు..

బీసీని సీఎం చేయడం బీఆర్ఎస్‍తో సాధ్యం అవుతుందా? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామంటున్న బీజేపీ కనీసం రాష్ట్ర అధ్యక్షుడి పదవిని కూడా బీసీకి ఇవ్వలేకపోయిందని విమర్శించారు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే ఆ పదవిని కిషన్ రెడ్డి లాక్కున్నారని, గతంలో బండారు దత్తాత్రేయ సీటు కూడా లాక్కున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కార్పొరేషన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలే అధికంగా ఉన్నారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలకే చాన్స్ ఇచ్చామన్నారు.

కొండా తొందరపడ్డారు..

మాజీ మంత్రి కొండా సురేఖ అంశంపై స్పందిస్తూ.. ఆమె కూతురు తొందరపడ్డారని చెప్పారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో గొప్పలు చెప్పుకోవడం, జబ్బలు చరుచుకుంటే సరిపోదని, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పరిపాలనను, వారి పోలీసు రాజ్యాన్ని ప్రజలు చూశారని గుర్తుచేశారు. రాష్ట్రంలో బీజేపీ మొక్క మొలకెత్తదని, రేవంత్ రెడ్డికి తనకు మధ్య కెమిస్ట్రీ కుదిరిందని తెలిపారు.

#pcc cheif mahesh goud#congress#telangana#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి