తెలంగాణ

TGSRTC : డ్రైవర్లు రాలేదని కండక్టర్లకు వేధింపులు.. ఇంటికి వెళ్లిపోవాలని!

రచన: Kumar••4 నిమిషాల పఠనం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కుషాయిగూడ ఆర్టీసీ డిపో వద్ద ఇవాళ ఉదయం స్వల్ప వివాదం నెలకొంది. విధులకు హాజరయ్యేందుకు డిపో వద్దకు వచ్చిన మహిళా కండక్టర్లను అధికారులు అడ్డుకున్నారు. విధుల్లోకి రావాల్సిన అవసరం లేదని అనుమతించలేదు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కుషాయిగూడ ఆర్టీసీ డిపో వద్ద ఇవాళ ఉదయం స్వల్ప వివాదం నెలకొంది. విధులకు హాజరయ్యేందుకు డిపో వద్దకు వచ్చిన మహిళా కండక్టర్లను అధికారులు అడ్డుకున్నారు. విధుల్లోకి రావాల్సిన అవసరం లేదని అనుమతించలేదు. ‘బస్ డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి’ అంటూ వారిని అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేయనివ్వకుండా అడ్డుకున్నట్టు సమాచారం. దీంతో మహిళా కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

బస్సులకు కేటాయించిన డ్రైవర్లు విధులకు రాకపోతే మమ్మల్ని సెలవు పెట్టి వెళ్లాలని అధికారులు చెబుతున్నారని ఆరోపించారు.విధుల్లోకి అనుమతించాలని డిపో ఎదుటే ఆందోళనకు దిగారు. ఉదయమే డిపోకు చేరుకున్నా అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకాలు చేయనివ్వకుండా అధికారులు అడ్డుకుంటున్నారని మహిళా కండక్టర్లు వాపోయారు. డ్రైవర్లు విధులకు హాజరు కాని సందర్భాల్లో తమను సెలవు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని మహిళా కండక్టర్లు తీవ్ర ఆరోపణలు చేశారు.

తాము విధులకు సిద్ధంగా ఉన్నప్పటికీ అనవసరంగా సెలవు తీసుకుంటే జీతంపై ప్రభావం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవర్లు రాకపోతే కండక్టర్లు ఎందుకు సెలవు పెట్టాలని ప్రశ్నించారు.ఉదయం నుంచి డిపోలోనే వేచి ఉన్నా తమకు విధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వడం లేదని వాపోయారు. డ్యూటీ కోసం వచ్చిన ఉద్యోగులను రిజిస్టర్‌లో సంతకాలు చేయనివ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదిలాఉండగా, డిపో అధికారులు దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. డ్రైవర్‌ విధులకు రాలేకపోతే అదే బస్సుకు కేటాయించిన కండక్టర్‌కు సెలవు వేస్తారనడం అవాస్తవమని స్పష్టంచేశారు. కండక్టర్లకు పూర్తి జీతాలు అందుతాయని, సెలవుగా నమోదు చేయడం వల్ల జీతంలో ఏ మాత్రం కోత ఉండదని వెల్లడించారు. కానీ, మహిళ కండక్టర్లు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. కాగా, డిపో వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు కుషాయిగూడ డిపో పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

#kushaiguda depot#hyderabad#women conducters#RTC officers#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి