Tollywood: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో 15 ఏళ్ళకి పైగా కొనసాగుతున్న సీనియర్ హీరోయిన్స్ కొందరు గత కొంతకాలంగా సినిమాలు లేక, రాక రిలాక్స్ అవుతున్నారు. ఒకదశలో హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న వీరికి, ఇప్పుడు అవకాశాలు కరువయ్యాయి. చెప్పాలంటే, మన సీనియర్ స్టార్ హీరోలకి మంచి జోడీ. కానీ, ప్రేక్షకులే వారిపై ఆసక్తి చూపడం లేదు. ఆ హీరోయిన్స్‌లో ముఖ్యంగా అనుష్క శెట్టి, మిల్కీ బ్యూటీ తమన్నా, కాజల్ అగర్వాల్, ప్రియమణి, త్రిష లాంటి వారున్నారు.
అనుష్క శెట్టి:
తెలుగులో హీరోయిన్స్ ప్రయోగాలు చేయడం చాలా అరుదు. కానీ, అనుష్క శెట్టి మాత్రం అరుంధతి, సైజ్ జీరో లాంటి సినిమాల కోసం చాలా ప్రయోగాలు చేసింది. కానీ, ఆ ప్రయోగాల వల్ల కెరీర్ బాగా డ్యామేజ్ అవుతుందని మాత్రం ఊహించలేదు. సైజ్ జీరో సినిమా తర్వాత తన ఫిజిక్‌లో వచ్చిన మార్పుల కారణంగా ఇంకా మంచి ఫ్యూచర్ ఉన్న అనుష్క నెమ్మదిగా ఫేడవుట్ అయిపోయింది. ఆమె, చేసిన సినిమాలు ఆదరణకు నోచుకోవడం లేదు.
తమన్నా:
మిల్కీ బ్యూటిగా తమన్నా సౌత్‌లో విపరీతమైన క్రేజ్‌ను తెచ్చుకుంది. బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. తమన్నా అంటే అందరికీ గుర్తొచ్చేది తన బెల్లీ డాన్స్. అయితే, గత నాలుగైదేళ్ళగా తమన్నా జనాలకి బోర్ కొట్టేసింది. అందుకే, అడల్ట్ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్, ఐటం సాంగ్స్‌తో నెట్టుకొస్తుంది. దాదాపు, ఈ మిల్కీ బ్యూటీ కూడా హీరోయిన్‌గా ఫేడవుట్ అయినట్టే అంటున్నారు.
త్రిష:
ఇటు తెలుగు, అటు తమిళంలో త్రిష కృష్ణ్‌కి ఉన్న క్రేజ్ విపరీతం. అయితే, ఈ రెండు భాషలలో దాదాపు అందరు స్టార్స్ పక్కన నటించిన త్రిష..మళ్ళీ మళ్ళీ సీనియర్స్ పక్కన నటించే ఫిజిక్ అండ్ గ్లామర్ మేయిన్‌టైన్ చేస్తున్నప్పటికీ..ఎందుకనో తెలుగు గానీ తమిళంలో గానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. ప్రియమణి గురించి చెప్పనవసరం లేదు. ఆమె హీరోయిన్‌గా కంటే స్మాల్ స్క్రీన్ జడ్జ్‌గా బిజీగా ఉంది.
కాజల్ అగర్వాల్:
మగధీర లాంటి సినిమాతో సౌత్‌లో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది కాజల్ అగర్వాల్. మెగాస్టార్, మెగా పవర్ స్టార్, పవర్ స్టార్‌లతో నటించిన ఘనత..తమన్నా తర్వాత కాజల్ అగర్వాల్‌లకే దక్కింది. పెళ్ళి తర్వాత కాజల్ కి హీరోయిన్‌గా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. వీరందరూ హీరోయిన్‌గా రిటైర్‌మెంట్ తీసుకున్నట్టే అనిపిస్తోంది. హీరోయిన్‌గా అవకాశాలు ఇచ్చే మేకర్స్ లేరు. ఒకవేళ ఇచ్చినా వారిని చూసే ప్రేక్షకులు లేరు.


