సినిమా

Karthi: కార్తీ టార్గెట్ కూడా టాలీవుడ్!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Karthi: తమిళ, మలయాళ హీరోలు ఈ మధ్య మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి మార్కెట్‌ను సంపాదించుకుంటున్నారు. మన తెలుగు హీరోలు ఇతర భాషలలో స్ట్రైట్ సినిమాలు చేయడానికి అవకాశాలు దక్కడం లేదు. కానీ, మన ఫిల్మ్ మేకర్స్ మాత్రం కోలీవుడ్, శాండిల్‌వుడ్ హీరోలను టాలీవుడ్‌కి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే, తమిళ స్టార్ హీరో కార్తి కూడా నేరుగా తెలుగు సినిమాలను చేస్తూ వస్తున్నాడు.

నాగార్జునతో 'ఊపిరి':

2016లో ఊపిరి సినిమా వచ్చి భారీ హిట్ సాధించింది. ఈ సినిమాతో కార్తి టాలీవుడ్‌లో స్ట్రైట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. నాగార్జునతో కలిసి చేసిన ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. వాస్తవానికి, నాగ్‌తో కలిసి ఎన్‌టిర్ చేయాల్సిన సినిమా. కానీ, స్టార్ ఇమేజ్ కారణంగా తారక్ నో చెప్తే, ఆ ప్లేస్‌ను కార్తి భర్తీ చేశాడు. మల్టీస్టారర్‌గా రూపొందిన ఊపిరి సినిమా వల్ల కార్తికి ఇక్కడ ఫ్యాన్స్ ఏర్పడ్డారు.

ఆ తర్వాత, తమిళంలో కార్తి నటించిన సినిమాలను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మంచి ఆదరణను దక్కించుకుంటున్నాయి. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నాని నిర్మాణలో రూపొందుతున్న హిట్ ఫ్రాంఛైజీస్‌లో కార్తి నటించబోతున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. హిట్ 3లో నాని నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ క్లైమాక్స్‌లో కార్తిని రివీల్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు. హిట్ 4లో హీరో కార్తి అని అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ అయింది.

అయితే, కార్తి మరో తెలుగు సినిమాను సైలెంట్‌గా పూర్తి చేస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో కార్తి ఒక పక్కా కామెడీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌ను చేస్తున్నాడట. ఇప్పటికే, ఈ సినిమా రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయినట్టుగా సమాచారం. మూడవ షెడ్యూల్ రెడీ అవుతున్నారు. కార్తి సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో దర్శకుడిగా మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు కళ్యాణ్ శంకర్. మరి, కార్తితో ఎలాంటి ఎంటర్‌టైనర్ చేస్తున్నాడో చూడాలి.

#Karthi#Kalyan Shankar#Nagavamshi#Tollywood#Meenakshi Chaudary
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి