International

దీపావళి వరకు నిరసనలు ఆపేద్దాం: అభిజీత్ దీప్కే కీలక ప్రకటన!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీనామా చేయాలనే డిమాండ్‌తో దేశ రాజధానిలో తీవ్రస్థాయిలో కొనసాగుతున్న నిరసనకు బ్రేక్ పడింది. ఈ నిరసనలను దీపావళి పండుగ ముగిసే వరకు తాత్కాలికంగా నిలిపివేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

 కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీనామా చేయాలనే డిమాండ్‌తో దేశ రాజధానిలో తీవ్రస్థాయిలో కొనసాగుతున్న నిరసనకు బ్రేక్ పడింది. ఈ నిరసనలను దీపావళి పండుగ ముగిసే వరకు తాత్కాలికంగా నిలిపివేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పండుగ వాతావరణంలో కార్యకర్తలందరూ తమ నిరసనలను పక్కనబెట్టి, కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా సమయాన్ని గడపాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

 ఆందోళనల్లో రాత్రింబవళ్లు పాల్గొంటున్న యువత ఆరోగ్యం, భద్రత పట్ల వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అభిజీత్ వెల్లడించారు. అంతేకాకుండా, ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న పార్టీ ముఖ్య నేతలు సౌరవ్ దాస్, అశుతోష్‌లతో పాటు తన కుటుంబం కూడా ఈ అనూహ్య పరిణామాలతో ఎంతో మానసిక వేదనను అనుభవిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సున్నితమైన అంశాలన్నింటినీ సమగ్రంగా పరిగణనలోకి తీసుకుని, తాత్కాలికంగా ఆందోళనలకు విరామం ప్రకటిస్తున్నట్లు పార్టీ వైఖరిని వెల్లడించారు.

 మరోవైపు, విజయదశమి వేడుకలను పురస్కరించుకుని ఢిల్లీలోని ప్రసిద్ధ రామ్‌లీలా మైదానంలో రావణాసురుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తుల దిష్టిబొమ్మలతో పాటు ఏకంగా 30అడుగుల భారీ 'బొద్దింక' దిష్టిబొమ్మను కూడా దహనం చేయాలని రామ్‌లీలా ఉత్సవ కమిటీ నిర్ణయించింది. 'స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ ఢిల్లీ' ప్రచారంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు తెలపగా, దీనిపై అభిజీత్ దీప్కే వ్యంగ్యంగా స్పందించారు. రూపాయి ఖర్చు లేకుండా తమ 'కాక్రోచ్ జనతా పార్టీ'కి ఉచితంగా ప్రచారం కల్పిస్తున్నందుకు రామ్‌లీలా కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

 ఇదిలా ఉండగా దీపావళి పండుగ తర్వాత తమ డిమాండ్ల సాధనకై పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. ఈ తాత్కాలిక విరామం కేవలం పండుగ వాతావరణం, కార్యకర్తల సంక్షేమం దృష్ట్యా తీసుకున్న నిర్ణయం మాత్రమేనని, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేసేవరకు తమ పోరాటం ఆగేది లేదని ఆయన తేల్చి చెప్పారు. పండుగ ముగిసిన వెంటనే కొత్త వ్యూహంతో ముందుకు వస్తామని, దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులను ఏకం చేసి నిరసనను తదుపరి స్థాయికి తీసుకెళ్తామని ఆయన హెచ్చరించారు.

 

#AbhijitDeepkeCJP#CJPProtestsSuspended#DelhiRamlilaCockroachEffigy#CJPvsCEC#DelhiPoliticalNews2026#NationalNewsTelugu#DelhiPolitics
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి