RC 17: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం ప్రారంభం కావాల్సి ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఈ ప్రాజెక్ట్‌ను దసరా పండుగ సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రకటిస్తారని అంతటా ప్రచారం జరిగింది. కానీ, అసలు విజయదశమి రోజున ఈ ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. దీంతో, సోషల్ మీడియాలో రక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ - సుకుమార్ రైటింగ్స్ కలిసి భారీ బడ్జెట్‌తో ఆర్సీ 17 చిత్రాన్ని చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్‌లో వచ్చిన రంగస్థలం ఘన విజయాన్ని సాధించింది. మైత్రీ వారు ఇప్పుడు టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతలుగా నిలబడ్డారంటే దానికి కారణం రంగస్థలం సినిమా అని అందరికీ తెలిసిందే. మళ్ళీ, ఈ కాంబినేషన్‌లో ప్రాజెక్ట్ అనగానే ప్రతీ ఒక్కరిలో ఆసక్తి, అంచనాలు భారీ స్థాయిలో మొదలయ్యాయి. కానీ, నిన్నా మొన్నటి వరకూ అనుకున్నట్టుగా ఆర్సీ 17 దసరాకి ఓపెన్ కాలేదు.
లొకేషన్స్ ఫైనల్ కాలేదనే.!
సుకుమార్, చరణ్ కలిసి ఆర్సీ 17 కోసం విదేశాలలో లొకేషన్స్ చూస్తున్నారు. యూకే లో మేజర్ సినిమా షూట్ జరపనున్నారట. అందుకే, గత 15 రోజులుగా సుక్కూ-చరణ్ యూకేలో పర్యటించారని తెలుస్తోంది. అక్కడ లొకేషన్స్ ఫైనల్ అవడంతో ఇండియాకి రాబోతున్నారట. త్వరలో, అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టి కంటిన్యూ షెడ్యూల్స్‌తో పూర్తి చేయనున్నారని సమాచారం. 2028లో రిలీజ్ ప్లాన్ చేయడానికి సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవలే, ఈ సినిమా కోసం కొత్త ఆఫీసును కూడా ప్రారంభించారు.
'పెద్ది' డిసప్పాయింట్ చేసింది:
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చరణ్ నటించిన 'పెద్ది' ఎన్నో అంచనాల మధ్య వచ్చింది. కానీ, ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. 'పెద్ది' వల్ల నిర్మాతలకి బాగానే నష్టాలు వచ్చినట్టుగా ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపించాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ వైడ్‌గా పాపులారిటీని తెచ్చుకున్న రామ్ చరణ్..ఆ తర్వాత చేసిన రెండు సినిమాలతో మాత్రం ఆ సక్సెస్ ఫీట్‌ను కంటిన్యూ చేయలేకపోయాడు. అందుకే, ఆర్సీ 17 మీద ఫుల్ ఫోకస్ పెట్టాడు. గ్లోబల్ రేంజ్‌లో మళ్ళీ సత్తా చాటేందుకు చరణ్ గట్టి ప్రయతాలను చేస్తున్నాడు.


