Jailer 2: సౌత్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ 2 మూవీతో సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కోలీవుడ్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ సక్సెస్‌ను సాధించింది. మనకి అటు తమిళంలో గానీ, ఇటు తెలుగులో గానీ పార్ట్ 2 సక్సెస్ అయిన సందర్భాలు చాలా తక్కువ. అందుకే, జైలర్ లాంటి మంచి కమర్షియల్ హిట్ తర్వాత ఇదే సినిమాకి సీక్వెల్ అంటే కాస్త సందేహాలు కలిగాయి.
కథ కుదిరితే రజినీ మేనియా సునామీనే:
తమిళంలో ఇప్పుడు ఏ స్టార్ హీరో చేయనంత సూపర్ ఫాస్ట్‌గా రజినీకాంత్ సినిమాలు చేస్తున్నాడు. అంతేకాదు, బాక్సాఫీస్ వద్ద ఆయన సినిమా ఒక్కోటి వందల కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబడుతూ నిర్మాతలకు భారీ లాభాలను తీసుకువస్తున్నారు. దర్శకులు కూడా ఆయన ఏజ్‌కి తగ్గ కథలను తయారు చేస్తూ..అభిమానులు సర్ప్రైజ్ అయ్యే మేకోవర్‌తో పవర్ఫుల్ పాత్రల్లో చూపిస్తున్నారు. యంగ్ హీరోలు కూడా ఇంత జెట్ స్పీడ్‌లో సినిమాలు చేయలేకపోతున్నారు.
'బాబా' తర్వాత సినిమాలకి గుడ్‌బై.!
వాస్తవానికి రజినీకాంత్ 'బాబా' తర్వాత సినిమాలకి గుడ్‌బై చెప్పాలనుకున్నారు. కానీ, ఆ సినిమా అనూహ్యంగా భారీ డిజాస్టర్‌గా మిగిలింది. దాంతో, మళ్ళీ ఒక సాలీడ్ హిట్ కొట్టిన తర్వాతే సినిమా ఇండస్ట్రీ నుంచి విరామం తీసుకోవాలనుకున్నాడు రజినీ. దాంతో, మళ్ళీ కథలను వింటూ సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ఎప్పుడో చెప్పాల్సిన గుడ్‌బై ఇప్పట్లో చెప్పేలా లేరు. దీనికి, కారణం..అభిమానులు..ఆయన సినిమాల వల్ల ఎన్నో వందల కుటుంబాలకి పోషణ. అందుకే, ఏమాత్రం విరామం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తున్నారు.
జైలర్ 2: ప్రతీరోజు 100 కోట్ల గ్రాస్.!
ఈ అక్టోబర్ 15న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజినీకాంత్ జైలర్ 2 మొదటి రోజునుంచే సూపర్ హిట్ టాక్‌తో కొనసాగుతోంది. అయితే, తాజాగా మేకర్స్ నుంచి అందిన అప్డేట్ ప్రకారం రిలీజైన అక్టోబర్ 15నుంచి ఇప్పటి వరకూ ప్రతీరోజు 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబడుతూ, రజినీ భారీ షాకిచ్చాడు. ఇది, కెరీర్లో ఇప్పటి వరకూ ఏ స్టార్ హీరోకి జరగలేదు. ఇక్కడ, రజినీ మేనియానే ఈ గ్రాస్ కలెక్షన్స్‌కి ప్రధాన కారణం అని కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇక, ఈ సినిమా వసూళ్ల సునామీని సృష్ఠిస్తుంటే రజినీ మాత్రం 'ధర్మన్' షూట్లో బిజీగా ఉన్నారు.


