Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్..చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కనిపించింది. అది కూడా 4000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ మూవీ రామాయణతో. ఇందులో, రకుల్ నెగిటివ్ రోల్ చేసింది. మైథలాజికల్ సినిమాలో నటించడం రకుల్‌కి ఇదే మొదటి సారి. ఈ సినిమాలో శూర్పణఖ పాత్రలో అలరించడానికి సిద్ధమవుతోంది. ఇటీవల, ఈ సినిమా ట్రైలర్ చూస్తే, రకుల్ శూర్పణఖ పాత్రలో అద్భుతంగా నటించినట్టు అనిపించింది. అంతేకాదు, ఈ సినిమా తర్వాత రకుల్ కి ఇటు సౌత్ అటు నార్త్‌లో నెగిటివ్ రోల్స్ చేసే అవకాశాలు మెండుగా వస్తాయంటున్నారు.
2009లో గిల్లి అనే కన్నడ సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది రకుల్. ఆ తర్వాత తెలుగులో కెరటం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 2013లో వచ్చిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలో ప్రార్థన పాత్రలో ఆకట్టుకొని టాలీవుడ్ లో వరుసగా అవకాశాలను అందుకుంది. ఇలా, తెలుగు..తమిళ..కన్నడ సినిమాలతో పాటు హిందీలో యారియాన్ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ రకంగా రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ అండ్ నార్త్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్గా మారింది.
రారండోయ్ వేడుక చూడం, నాన్నకు ప్రేమతో, ధృవ, జయ జానకి నాయక లాంటి సినిమాలతో తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఎక్కువగా, ఈ బ్యూటీ తెలుగు-తమిళ సినిమాలలో భారీ రెమ్యునరేషన్ అందుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమా డిజాస్టర్..ఆ తర్వాత నితిన్ నటించిన చెక్, పంజా వైష్ణవ్ తేజ్ నటించిన కొండపొలం, నాగార్జున నటించిన మన్మధుడు లాంటి సినిమాలు రకుల్ గ్రాఫ్‌ను అమాంతం తగ్గించేశాయి. దాంతో, గత నాలుగైదేళ్ళుగా తెలుగులో అవకాశాలు దక్కలేదు.
"రామాయణ"తో మళ్ళీ ఫాంలోకి వచ్చిన రకుల్:
బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న రామాయణ సినిమాలో సీతగా సాయి పల్లవికి ఎంత గొప్ప పాత్ర దక్కిందో..శూర్పణఖ లాంటి మంచి పాత్ర రకుల్‌కీ దక్కింది. ఇది నెగిటివ్ రోల్. ఈ రోల్లో గనక రకుల్ ప్రీత్ సింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే రానున్న రోజుల్లో లేడీ విలన్ పాత్రలకి ఖచ్చితంగా పర్ఫెక్ట్ ఛాయిస్‌గా నిలుస్తుంది. మరి, సినిమాలో ఈ పాత్ర నిడివి ఎంత..రకుల్ స్క్రీన్‌పై ఎంతవరకు తన పర్ఫార్మెన్స్తో మ్యాజిక్ చేసింది అనేది రామాయణ విడుదలైతేగానీ తెలియదు.


