సినిమా

Sai Pallavi: జీవితంలో ఇలాంటి రోల్ చేయడం అందరివల్లా కాదు!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Sai Pallavi: హీరోయిన్స్‌కి ఛాలెంజింగ్ రోల్స్ అంటే చాలా ఇష్టం. కానీ, అందరూ అలాంటి రోల్స్ చేయడానికి ధైర్యం చేయరు. ఎక్కువమంది ఫక్తు కమర్షియల్ సినిమాలను చేయడానికి, గ్లామర్ హీరోయిన్ అనిపించుకోవడానికే ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే, మన సౌత్ సినిమా ఇండస్ట్రీలో ప్రయోగాలు చేసే హీరోయిన్స్ చాలా తక్కువ. పైగా, అందరికీ ఇలాంటి పాత్రలు చేసే అవకాశం దక్కదు. రామాయణ సినిమాలో మాత్రం సాయి పల్లవి గొప్ప పాత్రను చేసే అవకాశం దక్కించుకుంది.

తెలుగులో, తమిళంలో, మలయాళ ఇండస్ట్రీలలో సాయి పల్లవికి నేచురల్ పర్ఫార్మర్‌గా మంచి క్రేజ్ ఉంది. సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి కథా బలమున్న సినిమాలనే ఎంచుకుంటోంది. రెమ్యునరేషన్ ఇస్తే హద్దులు దాటి ఎలాంటి పాత్రలైనా చేసే హీరోయిన్స్ ఉన్న ఈ రోజుల్లో అలాంటి వారందరికంటే పూర్తి భిన్నంగా సాయి పల్లవి కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఆమెకున్న పాపులారిటీ, ప్రేక్షకుల్లో ఆదరణ, ఫ్యాన్ ఫాలోయింగ్‌కి వరుసగా సినిమాలను ఒప్పుకోవచ్చు.

కానీ, చేసే సినిమాలు పదైనా చాలు.. అవి జీవితంలో తిరిగి చూసుకుంటే ఎంతో గొప్పగా అనిపించాలనే తపన, తాపత్రయంతో మనసుకు నచ్చిన పాత్రలనే చేస్తోంది. తెలుగులో ఫిదా బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి, ఇక్కడ మంచి సినిమాలతో ఆకట్టుకుంది. ఇప్పుడు, బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అక్కడ, లవ్ స్టోరీ 'ఏక్ దిన్' తో వచ్చింది. డెబ్యూ సినిమా బాగా డిసప్పాయింట్ చేసింది.

ఇక, త్వరలో దాదాపు 4000 కోట్ల భారీ బడ్జెట్ మువీ రామాయణతో మన ముందుకు రాబోతోంది. నితీష్ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన రామాయణ మొదటి భాగం దీపావళి కానుకగా నవంబర్‌లో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో మేకర్స్ హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అంతేకాదు, బాలీవుడ్ హీరో నుంచి దర్శకుడు సహా ప్రతీ ఒక్కరు సాయి పల్లవి నటనను ఎంతగానో మెచ్చుకుంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ప్రతీ ఒక్కరిదీ ఒకే మాట. సీత పాత్ర చేయడం ఎంతో అదృష్టం..ఆ అదృష్టం సాయి పల్లకి దక్కింది అని. మరి, ఈ సినిమాలో సీతగా ఆమె ఎంతవరకూ మెప్పిస్తుందో చూడాలనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

#Sai Pallavi#Ramayana#Nithish Tiwari#RabbeerKapoor#Yash
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి