సినిమా

Devisriprasad: విజయదశమి రోజున "ఎల్లమ్మ" అప్‌డేట్..

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Devisriprasad: విజయదశమి పండుగ పర్వదినాన ఎల్లమ్మ సినిమా నుంచి ఊహించని అప్‌డేట్ రావడం ప్రేక్షకుల్లో ఆనందాన్ని కలిగించింది. అసలు, ఈ సినిమా గురించి గతకొన్ని రోజుల నుంచి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఉందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. వాటికి మేకర్స్ చెక్ పెడుతూ దసరా పండుగ రోజు ఎల్లమ్మ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ పోస్టర్ వదిలారు. 2027, మార్చి 5న ఎల్లమ్మ జాతర మొదలు కాబోతోంది.

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మొదటిసారి హీరోగా నటిస్తున్న సినిమా ఎల్లమ్మ. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు. బలగం సినిమాతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న కమెడియన్ వేణు ఎల్దండి ఎల్లమ్మ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. హైదరాబాద్ కీసర పాత్రంలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్స్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

ఎల్లమ్మ గ్లింప్స్‌తో హైప్:

ప్రాజెక్ట్ మొదలైనప్పుడు డీఎస్పీని రివీల్ చేస్తూ టైటిల్ గ్లింప్స్ వదిలారు మేకర్స్. ఈ గ్లింప్స్ తర్వాత అంచనాలు భారీగా పెరిగాయి. ఆ తర్వాత నుంచి ఈ సినిమాకి సంబందించిన అప్‌డేట్స్ ఏవీ రాలేదు. తాజాగా, దిల్ రాజు అండ్ టీమ్ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్‌ను వదిలారు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. అయితే, ఇక్కడ ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. వాస్తవానికి, ఎల్లమ్మ విడుదల తేదీకే ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమా రిలీజ్ కావాల్సింది.

అనూహ్యంగా, ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తూ మేకర్స్ 2027, అక్టోబర్ 29కి వాయిదా వేశారు. దాంతో, ఆ డేట్ ని మరో పాన్ ఇండియా సినిమా భర్తీ చేస్తుందనుకున్నారు. కానీ, ప్రభాస్ స్పిరిట్ తేదీని ఎల్లమ్మ భర్తీ చేస్తుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. మొత్తానికి, ఎల్లమ్మ సినిమా నుంచి జనాలలో ఉన్న అనుమానాలను తీర్చేసింది దిల్ రాజు టీమ్. మొదటిసారి హీరోగా ఎంట్రీ ఇస్తున్న దేవికి ఈ సినిమా ఎలాంటి మైలేజ్ ఇస్తుందో..చూడాలి. ఎల్లమ్మ కోసమే, కొత్త సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా వర్క్ చేయలేకపోతున్నాడు రాక్ స్టార్.

#Devisriprasad#Yellamma#Dil Raju#Tollwood#Yellamma Release Date
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి