సినిమా

Vishwambhara: మెగాస్టార్ విశ్వంభర చిత్రాన్ని మర్చిపోండిక!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Vishwambhara: టాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కెరీర్‌లో ఇప్పటికే, ఎన్నో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మాస్ ఆడియన్స్‌లో చిరు క్రేజ్ నెక్స్ట్ లెవల్. అయితే, ఇప్పుడు సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’

Vishwambhara: టాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కెరీర్‌లో ఇప్పటికే, ఎన్నో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మాస్ ఆడియన్స్‌లో చిరు క్రేజ్ నెక్స్ట్ లెవల్. అయితే, ఇప్పుడు సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ గురించి అందరిలోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. కానీ, ఈ దసరా పండుగ రోజు కూడా ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో, మెగా అభిమానులు డిసప్పాయింట్ అవుతున్నారు.

‘అంజి’ తర్వాత మళ్ళీ భారీ విజువల్స్, అద్భుతమైన గ్రాఫిక్స్, సరికొత్త కథాంశంతో రూపొందుతున్న విశ్వంభర సినిమా మెగా అభిమానుల్లో ముందు నుంచి భారీ అంచనాలను పెంచింది. యువ దర్శకుడు మల్లిడి వశిష్ట ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటం..అగ్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండటంతో పాన్ ఇండియా వైడ్‌గా ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, ఈ సినిమాకి మైనస్ అయింది విజువల్ ఎఫెక్ట్స్.

దానివల్లే, ఎప్పుడో రిలీజ్ కావాల్సిన విశ్వంభర ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఒకవైపు, బాబి దర్శకత్వంలో మెగాస్టార్ చేస్తోన్న 'కాకా' సినిమా దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తైంది. ఈ సంక్రాంతికి బరిలో దిగుతోంది. కానీ, విశ్వంభర ఊసు మాత్రం అసలు లేదు. దీంతో, ఇక ఈ సినిమా గురించి మర్చిపోవాల్సిందేనని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. త్రిష చాలాకాలం తర్వాత కంబ్యాక్ ఇస్తున్న సినిమా. కాబట్టి, ఆమె కూడా విశ్వంభర రిలీజ్ మీద చాలా నమ్మకాలు పెట్టుకుంది.

కానీ, మేకర్స్ నుంచి ఎలాంటి సౌండ్ లేకపోవడంతో ఇప్పట్లో విశ్వంభర విడుదల కాదని అర్థమవుతోంది. దర్శకుడు వశిష్ట కూడా ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి ప్రీప్రొడక్షన్స్ వర్క్ చేస్తూ బిజీగా ఉన్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నట్టుగా ప్రకటించారు. రెండుసార్లు పోస్ట్ పోన్ అయిన ఆదర్శ కుటుంబం సినిమా నుంచి విడుదల తేదీ వచ్చింది. కానీ, మెగాస్టార్ విశ్వంభర నుంచి కనీసం శుభాకాంక్షలు కూడా రాకపోవడం గమనర్హం.

#Vishwambhara#Megastar Chiranjeevi#Trisha Krishnan#Mallidi Vassishta
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి