వైరల్ న్యూస్

Viral : రీల్స్ పిచ్చి.. చిన్నారని సముద్రపు అలల్లో వదిలేసి వెర్రివేషాలు!

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

నేటి తరానికి ప్రస్తుత డిజిటల్‌ యుగంలో రీల్స్‌, సెల్ఫీల పిచ్చి రోజురోజుకూ ముదురుతోంది. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉండాల్సిందే. ప్రకృతి దృశ్యాల నుంచి ప్రమాదకరమైన ప్రదేశాల వరకు ప్రతిచోటా ఫొటోలు, వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడమే కొందరికి దినచర్యగా మారింది.

నేటి తరానికి ప్రస్తుత డిజిటల్‌ యుగంలో రీల్స్‌, సెల్ఫీల పిచ్చి రోజురోజుకూ ముదురుతోంది. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉండాల్సిందే. ప్రకృతి దృశ్యాల నుంచి ప్రమాదకరమైన ప్రదేశాల వరకు ప్రతిచోటా ఫొటోలు, వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడమే కొందరికి దినచర్యగా మారింది.

లైకులు, వ్యూస్‌, కామెంట్ల కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. క్షణికమైన ఆనందం కోసం ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో గడపాల్సిన సమయాన్ని కూడా ఫోన్‌,సోషల్ మీడియాకే అంకితం చేస్తున్నారు. నిజజీవితంలోని అనుభూతుల కంటే సోషల్‌ మీడియాలో కనిపించే గుర్తింపు,పొగడ్తలు, కామెంట్స్‌కే సమయం వెచ్చించడం, ప్రాధాన్యమిస్తున్నారు. వినోదంగా మొదలైన ఈ వ్యామోహం ఎప్పుడు ప్రాణాంతకంగా మారుతుందో తెలియడం లేదు. రీల్స్‌, సెల్ఫీల మోజులో మనిషి విలువైన జీవితాన్ని మరిచిపోతున్నాడు.

ఆ పిచ్చిలో పడిపోయిన పక్కన ఏం జరుగుతోంది? తన వాళ్లకు ఏం అవుతుందో కూడా చూసుకోవడం లేదు. సోషల్ మీడియా, రీల్స్ మత్తులో మునిగితేలుతున్నాడు. తాజాగా ఓ జంట సెల్ఫీ, రీల్స్ పిచ్చిలో పడి కన్నకూతురిని సముద్రపు అలలకు వదిలేశారు. బీచ్ వద్ద చిన్నారి ఆడుకుంటూ ఉండగా.. ఆమె తండ్రి సెల్పీ స్టిక్ చేతబట్టుకుని వీడియో తీయడం ప్రారంభించాడు.దీంతో అప్పటివరకు చిన్నారిని పట్టుకున్న తల్లి..కూతురిని వదిలేసి భర్తతో కలిసి సెల్ఫీలు దిగడం మొదలెట్టింది.

ఆ సమయంలో అలల ధాటికి చిన్నారి కొట్టుకుపోయినా ఏమీ పట్టనట్టు వీడియో తీసుకోవడంలో బిజీగా ఉండిపోయారు. ఇంతలో ఓ అబ్బాయి వచ్చి ఆ పాపను పట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. రీల్స్ పిచ్చిలో చిన్నారి ప్రాణాలనే పణంగా పెడతారా? అంటూ ఆ జంటపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకపడుతున్నారు. మీ పైత్యానికి చిన్నారని బలి చేసే బదులు మీరే సముద్రంలోకి వెళ్లొచ్చు కదా? అంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమయానికి అబ్బాయి వచ్చి పాపను పట్టుకోకపోతే అలలు ఆ చిన్నారని సముద్రంలోనికి లాక్కెళ్లేవని మండిపడుతున్నారు.

#reels#selfi video#baby#sea waves#danger#viral video#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి