National

JIO : రేపు పబ్లిక్ ఇష్యూకు ‘జియో’.. రూ.2.5 లక్షల కోట్ల బిడ్స్ దాఖలు!

రచన: Kumar••4 నిమిషాల పఠనం

స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త చరిత్ర లిఖించేందుకు రిలయ్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రిస్‌ సిద్ధమైంది. రేపు జియో తొలిసారి పబ్లిక్ ఇష్యూ (IPO)కు రానుంది. దేశీయ టెలికాం, డిజిటల్ రంగాల్లో కీలకంగా మారిన జియో ఐపీవో అక్టోబర్ 21న ప్రారంభంకానుంది.

స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త చరిత్ర లిఖించేందుకు రిలయ్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రిస్‌ సిద్ధమైంది. రేపు జియో తొలిసారి పబ్లిక్ ఇష్యూ (IPO)కు రానుంది. దేశీయ టెలికాం, డిజిటల్ రంగాల్లో కీలకంగా మారిన జియో ఐపీవో అక్టోబర్ 21న ప్రారంభంకానుంది. కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 21న ప్రారంభమై అక్టోబర్ 23న ముగుస్తుంది. రెండ్రోజుల పాటు పబ్లిక్ ఇష్యూ కొనసాగనుంది. దీనికి ఇప్పటికే అపూర్వ స్పందన వచ్చినట్టు తెలుస్తోంది.

రూ.8,110 కోట్ల యాంకర్ బుక్‌కు ఏకంగా 30 రెట్లకు పైగా (రూ.2.5 లక్షల కోట్లకు పైగా) బిడ్లు దాఖలైనట్టు సమాచారం. దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలవనుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.ఐపీవో ద్వారా సుమారు రూ.30 వేల కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. షేర్ల ధరల శ్రేణిని రూ.1,065 - 1,119గా నిర్ణయించింది. ధరల శ్రేణిలో గరిష్ట స్థాయి ప్రకారం కంపెనీ రూ.30,213 కోట్లు సమీకరించే అవకాశం ఉంది.

ఈ పబ్లిక్‌ ఆఫర్‌‌లో భాగంగా కంపెనీ రూ.500 కోట్ల విలువైన షేర్లను జేపీఎల్‌ (JPL) ఉద్యోగులకు, రూ.2,500 కోట్ల విలువైన షేర్లను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వాటాదారులకు రిజర్వ్‌ చేసింది. జేపీఎల్‌ షేర్లు ఈ నెల 28న స్టాక్‌ ఎక్స్‌ఛేంజీల్లో నమోదు కానున్నాయి. దీని ద్వారా అప్పర్ ప్రైస్ బ్యాండ్ వద్ద జియో ప్లాట్‌ఫామ్స్ విలువ సుమారు రూ.10.3 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఐపీవోలో ఎల్‌ఐసీ, బ్లాక్‌రాక్, ఫిడిలిటీ, జీఐసీ, ప్రముఖ భారతీయ మ్యూచువల్ ఫండ్‌లు ప్రధాన యాంకర్ పెట్టుబడిదారుల్లో భాగస్వామ్యం కానున్నాయి.

తొలిసారి ఐపీవోకు వచ్చిన జియో 27 కోట్ల షేర్లను విక్రయించనున్నట్టు సమాచారం. సమీకరించిన నిధులను జియో ప్లాట్‌ఫామ్స్ టెలికాం అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్‌లో రుణాలను తగ్గించడానికి ఉపయోగించనున్నట్టు తెలుస్తోంది. జియో నికర రాబడిలో రూ.27,500 కోట్ల వరకు రుణాల చెల్లింపు లేదా ముందస్తు చెల్లింపు కోసం వినియోగించాలని ఆలోచన చేసినట్టు సమాచారం. మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలు, ఇతర అనుమతించబడిన అవసరాల కోసం కేటాయించింది.

#JIO plotform#IPO#reliance industries#national#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి