National

National : సీజేపీ నేతలకు షాక్.. జ్యుడీషియల్ కస్టడీ పొడగింపు

రచన: Kumar••4 నిమిషాల పఠనం

కాక్రోచ్ జనతా పార్టీ నేతలకు బిగ్ షాక్ తగిలింది. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అనుమతి లేకుండా నిరసనలు చేపట్టిన కేసులో సీజేపీ కీలక అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు న్యాయస్థానం మరోసారి షాక్ ఇచ్చింది.వీరి జ్యుడీషియల్ కస్టడీని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టు మరో రెండు రోజుల పాటు పొడిగించింది.

కాక్రోచ్ జనతా పార్టీ నేతలకు బిగ్ షాక్ తగిలింది. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అనుమతి లేకుండా నిరసనలు చేపట్టిన కేసులో సీజేపీ కీలక అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు న్యాయస్థానం మరోసారి షాక్ ఇచ్చింది.వీరి జ్యుడీషియల్ కస్టడీని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టు మరో రెండు రోజుల పాటు పొడిగించింది. అయితే, తీర్పు చెప్పే క్రమంలో న్యాయస్థానం సీజేపీ నేతల ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

నిందితులకు చట్టమంటే ఏమాత్రం గౌరవం లేదని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆందోళనలు చేపట్టే ప్రాంతాల జాబితా నుంచి జంతర్ మంతర్‌ను డీ నోటిఫై చేసి సున్నితమైన ప్రదేశాల్లో జాబితాలో చేర్చినా అక్కడ పదేపదే నిరసనలకు పిలుపునివ్వడం సీజేపీ నేతలకు అలవాటుగా మారిందని మెజిస్ట్రేట్ అసహనం వెల్లిబుచ్చారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR)కు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టి నిషేధిత ప్రాంతంలోకి చొరబడేలా జనసమీకరణ చేశారన్న పోలీసుల నివేదిక ఆధారంగా శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా కస్టడీని పొడిగిస్తున్నట్లు మెజిస్ట్రేట్ కోర్టు తీర్పునిచ్చింది.

అయితే, వారి బెయిల్ పిటిషన్లపై విచారణలో భాగంగా సీజేపీ నేతలు సమర్పించిన జామీనుదారుల పత్రాల్లో గుర్తింపు వివరాల మధ్య వ్యత్యాసాలు, అస్పష్ట సమాధానాలు ఉండటంతో న్యాయస్థానం వాటిని రిజెక్ట్ చేసింది. నూతన పూచీకత్తులను సమర్పించాలని వారి తరపు న్యాయవాదులను ఆదేశించింది.మరోవైపు న్యాయస్థానం నిర్ణయంపై సీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము నిర్బంధంలో ఉన్నామని, ఇది న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడమేనని ఆరోపించారు.

న్యాయస్థానం నుంచి పోలీసు వ్యాన్‌లోకి వెళ్లే సమయంలో సౌరవ్ దాస్ స్పందిస్తూ.. దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొన్నాయని, పోలీసు, న్యాయస్థానాల ద్వారా తమ గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందన్నారు.కాగా, ఈ కేసులో లిఖితపూర్వక వాదనలు సమర్పించేందుకు ఇరుపక్షాలకు గడువిచ్చిన మెజిస్ట్రేట్.. తదుపరి విచారణను అక్టోబర్ 21కి వాయిదా వేశారు.ఓటు చోరీకి పాల్పడ్డారనే ఆరోపణల మేరకు కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాక్రోజ్ జనతా పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించినా జంతర్ మంతర్‌లోకి దొంగతనంగా చొరబడి నిరసనలు చేయడంతో అరెస్టు చేసి విషయం తెలిసిందే.

#CJP leaders#sourav#ranka#judicial custody#extenstion#Delhi#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి