క్రైమ్

Crime : మనుషులా? ఉన్మాదులా? భర్త కళ్లెదుటే భార్యపై గ్యాంగ్ రేప్!.. ఆపై!

రచన: Kumar••4 నిమిషాల పఠనం

దేశంలో అత్యాచార ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. నిందితులకు కఠిన శిక్షలు పడకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పదే పదే పునరావృతం అవుతున్నాయని కొందరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చట్టాలు కఠినం చేసినంత మాత్రన సరిపోదని, మహిళలు, యువతులు,మైనర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, లైంగికదాడులకు పాల్పడినా కఠిన శిక్షలు విధించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

దేశంలో అత్యాచార ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. నిందితులకు కఠిన శిక్షలు పడకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పదే పదే పునరావృతం అవుతున్నాయని కొందరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చట్టాలు కఠినం చేసినంత మాత్రన సరిపోదని, మహిళలు, యువతులు,మైనర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, లైంగికదాడులకు పాల్పడినా కఠిన శిక్షలు విధించాలని.. అప్పుడే ఇలాంటి నేరాలు తగ్గుముఖం పడతాయని, సమాజంలో మహిళలు ఎలాంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛంగా సంచరించ గలుగుతారని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.

మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం, లైంగికదాడులకు పాల్పడిన ఘటనల్లో నిందితులకు సాధారణ జైలు శిక్షలు విధిస్తున్నారని కొందరి అభిప్రాయం. అలాంటి సాధారణ శిక్షలకు బదులు లైఫ్ టైం జైలులోనే ఉండేలా శిక్షలు విధించాలని, ఈ మేరకు చట్టాల్లో మార్పులు చేయాలని వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే సమాజంలో నానాటికీ లైంగికదాడులు పెరగడమే కారణం.

తాజాగా బిహార్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్త ముందే వివాహితపై 8 మంది దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బిహార్‌ రాష్ట్రంలోని ఈస్ట్ చంపారన్ జిల్లా మధుబన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజారియా సరేహ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. కొత్తగా పెళ్లైన ఓ జంట దుర్గా పూజ కోసం జాతరకు వెళ్లి ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఆ సమయంలో వారిని 8 మంది దుండగులు అడ్డుకున్నారు.

భర్తను ఘోరంగా కొట్టి వారి వద్ద ఉన్న నగదు సహా నగలు లాక్కున్నారు. అనంతరం మహిళను మామిడి తోటలోకి లాక్కెళ్లి గ్యాంగ్‌ రేప్ చేశారు.భర్త అకౌంట్‌లో ఉన్న రూ.3 వేలు ఆన్‌లైన్‌లో బదిలీ చేయించుకుని అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన అక్టోబర్ 8వ తేదీన తెల్లవారుజామున 4 గంటల సమయంలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. తమకు జరిగిన అన్యాయాన్ని బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు ఫైల్ చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు. నిందితులు అంబికేశ్ తివారి(38), రింకీ కుమార్(19), అంకుశ్ కుమార్(19), రాహుల్ కుమార్(19),కంచన్ కుమార్(18), మున్నా కుమార్(18), రణ్‌ధీర్ కుమార్(20),అమిత్ కుమార్(18)గా గుర్తించారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

#Gangrape#bihar#newly couple#swechaanews#crime
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి