తెలంగాణ

TG : వరంగల్ ప్రజలకు షాక్.. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభం వాయిదా!

రచన: Kumar••4 నిమిషాల పఠనం

వరంగల్ ప్రజలకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇవాళ ప్రారంభం కావాల్సిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. దసరా కానుకగా ఆస్పత్రిని 'సాఫ్ట్ లాంచ్' చేసి ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలను ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

వరంగల్ ప్రజలకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇవాళ ప్రారంభం కావాల్సిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. దసరా కానుకగా ఆస్పత్రిని 'సాఫ్ట్ లాంచ్' చేసి ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలను ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, కొన్ని అనివార్య కారణాలతో హాస్పిటల్ ప్రారంభం వాయిదా పడినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ విషయం తెలియడంతో ఉమ్మడి వరంగల్ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.ఆసుపత్రి భవన నిర్మాణం, మౌలిక వసతులు, వైద్య పరికరాలు సమకూర్చడంలో ఆలస్యం కావడంతో ప్రారంభాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.అయితే, సరైన సన్నద్ధత లేకుండా కేవలం ప్రచారం కోసమే మంత్రులు గడువులు ప్రకటిస్తున్నారని, ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని స్థానిక ప్రజాసంఘాలు మండి పడుతున్నాయి.

ఆస్పత్రి ప్రారంభోత్సవ జాప్యంపై ప్రతిపక్షాలు సైతం తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. రేవంత్ సర్కార్ ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణాలను ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తోందని ఆరోపించాయి. ఫలితంగా వరంగల్ సహా చుట్టుపక్కల జిల్లాల నిరుపేద రోగులు అత్యవసర వైద్యం కోసం హైదరాబాద్‌కు పరుగులు తీయాల్సి వస్తోందని విమర్శించాయి. ఇకనైనా కాలయాపన చేయకుండా అవసరమైన నిధులను వెంటనే విడుదల చేసి, పూర్తిస్థాయి సౌకర్యాలతో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి.

కాగా, టిమ్స్ ఆస్పత్రుల్లో అందే సూపర్ స్పెషాలిటీ సేవలు సైతం వరంగల్ ఆస్పత్రిలో అందనున్నాయి. ఈ హాస్పిటల్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే అత్యవసర సేవల కోసం ప్రజలు జిల్లాలను వదిలి హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వం చెబుతోంది. ప్రజలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం ప్రారంభం కాగా, ప్రస్తుత ప్రభుత్వం సైతం వాటిని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

#warangal super speciality hosipital#inaguration#postpone#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి