సినిమా

Payal Rajput: పాయల్ ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్..ఏమవుతుందో పాపం!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Payal Rajput: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో డెబ్యూ మూవీతో సాలీడ్ హిట్ అందుకొని క్రేజీ హీరోయిన్‌గా పాపులర్ కాలేకపోయిన వాళ్ళలో పాయల్ రాజ్‌పుత్ ఒకరు. ఆర్ఎక్స్ 100 మూవీతో తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయమైన పాయల్..బోల్డ్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మొదటి సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న పాయల్ కెరీర్.. ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో సాగలేదు. మళ్ళీ, అజయ్ భూపతి దర్శకత్వంలోనే 'మంగళవారం' అనే థ్రిల్లర్ మూవీతో హిట్ అందుకుంది.

Payal Rajput: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో డెబ్యూ మూవీతో సాలీడ్ హిట్ అందుకొని క్రేజీ హీరోయిన్‌గా పాపులర్ కాలేకపోయిన వాళ్ళలో పాయల్ రాజ్‌పుత్ ఒకరు. ఆర్ఎక్స్ 100 మూవీతో తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయమైన పాయల్..బోల్డ్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మొదటి సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న పాయల్ కెరీర్.. ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో సాగలేదు. మళ్ళీ, అజయ్ భూపతి దర్శకత్వంలోనే 'మంగళవారం' అనే థ్రిల్లర్ మూవీతో హిట్ అందుకుంది. ఆ ప్రాజెక్ట్ సీక్వెల్ కోసం పాపం ఎంతగానో ఎదురుచూస్తోంది.

అజయ్ భూపతికి హిట్ చాలా అవసరం:

బోల్డ్ కంటెంట్‌తో బ్లాక్ బస్టర్ కొట్టాడు అజయ్ భూపతి. ఆ సినిమానే ఆర్ఎక్స్ 100. ఈ సినిమాతో బాగా పాపులర్ అయింది హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. హీరోగా నటించిన కార్తికేయ.. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో కెరీర్ సాగడం లేదు. వాస్తవానికి, మొదటి సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ ముగ్గురు కెరీర్ కాస్త డైలమాలోనే ఉంది. కార్తికేయ ఇప్పుడు తానే స్వీయ దర్శకత్వంలో సినిమాను చేసుకుంటున్నాడు.

అజయ్ భూపతి మాత్రం సినిమాలు చేస్తున్నప్పటికీ..అవి సక్సెస్ కోసం ఊగిసలాడుతున్నాయి. ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్. కానీ, రెండవ సినిమాను మల్టీస్టారర్‌గా మహాసముద్రం అని చేశాడు. ఈ సినిమా ఫ్లాప్‌గా మిగిలింది. దీంతో, టాలీవుడ్ హీరోలెవరూ అజయ్ భూపతికి ఛాన్స్ ఇవ్వలేదు. కొంత, గ్యాప్ తర్వాత తన మొదటి సినిమా హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌తో మంగళవారం సినిమాను చేసి హిట్ కొట్టాడు. ఈ సినిమా తర్వాత మళ్ళీ దర్శకుడిగా అజయ్‌కి గానీ, హీరోయిన్‌గా పాయల్‌కి గానీ హిట్ దక్కలేదు.

మంగళవారం సీక్వెల్:

గతంలోనే అజయ్ భూపతి మంగళవారం సినిమా సీక్వెల్ ఉంటుందని వెల్లడించాడు. అయితే, గత చిత్రం శ్రీనివాస మంగాపురం ఫ్లాపవడంతో అజయ్ కి ఇంకో ఆప్షన్ లేక మళ్ళీ మంగళవారం సీక్వెల్ మీద దృష్టి పెట్టాడు. ప్రస్తుతం, ఈ ప్రాజెక్ట్ ప్రీప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. పాయల్ కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తోంది. అజయ్-పాయల్ కాంబో బాగానే వర్కౌట్ అవుతోంది. ఇప్పటికే, వీరిద్దరు కలిసి రెండు సూపర్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. ఇద్దరికీ మంగళవారం సీక్వెల్ సక్సెస్ చాలా కీలకం.

#Payal Rajput#Mangalavaram 2#Ajay Bhupathy#Tollywood#RX 100
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి