సినిమా

Karthik Subbaraj: బాల్ మెగాస్టార్ కోర్టులో ఉంది..కార్తీక్ సుబ్బరాజ్!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Karthik Subbaraj: మెగాస్టార్ చిరంజీవికి కథ చెప్పానని..అయితే బాల్ ఆయన కోర్టులోనే ఉందని తాజాగా తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ క్లారిటీ ఇచ్చాడు. తెలుగు సినీ పరిశ్రమలో టాలెంటెడ్ డైరెక్టర్స్‌ను ఎంకరేజ్ చేయడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. కొత్త తరహా కథలు, సినిమాల గురించి ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలోనే, ఆయన తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ చెప్పిన కథ విన్నారు. కానీ, ఇంకా ఆయన డెసిషన్ ఏంటనేది రివీల్ చేయలేదు.

కాకా చిత్రాన్ని పూర్తి చేసిన మెగాస్టార్:

ప్రస్తుతం, చిరంజీవి కాకా చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు చిరు పోర్షన్ మొత్తం పూర్తైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన కొత్త కథలను వింటున్నారు. ఇప్పటికే, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేయాల్సి ఉండగా..ఇటీవల వచ్చిన ది ప్యారడైజ్ సినిమా ఫలితం వల్ల చిరు కొంతకాలం ఈ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టినట్టుగా తెలుస్తోంది.

దాంతో, ఇప్పుడు మైత్రీ-సుకుమార్ రైటింగ్స్ కలిసి బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమాను మెగాస్టార్‌తో ప్లాన్ చేస్తున్నారు. బుచ్చిబాబు కథను ఇంకా చిరుకి వినిపించలేదు. అది గనక నచ్చితే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే అయ్యే అవకాశాలున్నాయి. అలాగే, బోయపాటి శ్రీను..హరీష్ శంకర్ లాంటి వాళ్ళు చిరంజీవితో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదే వరుసలో గోపీచంద్ మలినేని పేరు కూడా ఉంది.

ఇదంతా ఒకెత్తైతే, తమిళ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో మెగాస్టార్ సినిమా చేయబోతున్నారని ఈ మధ్య ఒక వార్త బాగా వైరల్ అవుతోంది. దీనిపై, తాజాగా కార్తీక్ క్లారిటీ కూడా ఇచ్చాడు. కథ చెప్పిన మాట వాస్తవమే కానీ, ఇంకా ఫైనల్ డెసిషన్ మాత్రం చిరు నుంచి రాలేదని..బాల్ మెగాస్టార్ కోర్టులో ఉందని ఆయన చెప్పడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మాస్ అండ్ యాక్షన్ సినిమాలు చేయడంలో కార్తీక్ దిట్ట. కాబట్టి, చిరు ఇమేజ్‌కి తగ్గ కథ గ్యారెంటీగా చెప్పే ఉంటాడు. మరి, చిరు తన నిర్ణయాన్ని ఎప్పుడు చెప్తారో చూడాలి.

#Karthik Subbaraj#Megastar Chiranjeevi#Tollywood#Kollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి