తెలంగాణ

Mahabubabad: దారి తప్పిన బతుకమ్మ నిధులు.. అధికారుల తీరుతో డ్యామేజ్ అవుతున్న రేవంత్ సర్కార్!!..

రచన: Venu••7 నిమిషాల పఠనం

బతుకమ్మ వేడుకల్లో అత్యంత కీలకమైన తాజా పూలకు జీఎస్టీ సున్నా శాతం ఉంటే... అధికారులు మాత్రం 11 వేల రూపాయలు కట్ చేసి ఇవ్వడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదనే చర్చలు మొదలైయ్యాయి.

తెలంగాణ సాంస్కృతికి ప్రతీక, ఆడబిడ్డల ఆత్మగౌరవ వేడుక బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పది కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే.. ఈ పండుగ వేడుకలకు ఎలాంటి అంతరాయం కలుగకుండా ఘనంగా నిర్వహించుకునేలా ఈ నిధులు కేటాయించింది.

అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అధికారుల నిర్లక్ష్యం, అస్తవ్యస్త విధానాల వల్ల ప్రభుత్వం అభాసుపాలవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని విలీన గ్రామాల్లో బతుకమ్మ వేడుకల నిర్వహణ ప్రభుత్వ ఉద్దేశానికి తూట్లు పొడుస్తోందనే విమర్శలు అందుకుంటుంది.

ప్రభుత్వం బతుకమ్మ పండుగను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఒక్కో విలీన గ్రామానికి రూ. 50 వేలు మంజూరు చేయగా అధికారులు మాత్రం ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడిచేలా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది. విలీన గ్రామాలకు 50 వేల చొప్పున అందించవలసి ఉండగా.. జీఎస్టీ పేరుతో ఏకంగా రూ. 11,000 వేలు కట్ చేసి, కేవలం రూ. 39,000 వేల రూపాయలు మాత్రమే కౌన్సిలర్ల చేతిలో పెట్టడం వివాదాస్పదంగా మారింది.

బతుకమ్మ వేడుకల్లో అత్యంత కీలకమైన తాజా పూలకు జీఎస్టీ సున్నా శాతం ఉంటే... అధికారులు మాత్రం 11 వేల రూపాయలు కట్ చేసి ఇవ్వడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదనే చర్చలు మొదలైయ్యాయి. మరోవైపు మహబూబాబాద్ కలెక్టరేట్ తో పాటు ఆర్డీవో కార్యాలయాల్లో మాత్రం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, అధికారుల సమక్షంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు.

వీఐపీల సమక్షంలో లైటింగ్, మైక్ సెట్టింగ్‌లతో హడావుడి చేసిన అధికార యంత్రాంగం... విలీన గ్రామాల ప్రజల వద్దకు వచ్చేసరికి నిధుల కోత పెట్టడంతో ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయనే ప్రశ్నలు మొదలైయ్యాయి.. ఒకవైపు అరకొర నిధుల మంజూరు, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో పండుగ రోజు పవర్ కట్ కావడంతో మహిళలు చీకట్లోనే బతుకమ్మ ఆడాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఇది స్థానికంగా ప్రజల ఆగ్రహానికి కారణమైంది. ప్రభుత్వం మంచి మనసుతో భారీగా నిధులు విడుదల చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో కిందిస్థాయి అధికారుల అవినీతి, పర్యవేక్షణ లోపం వల్ల ఆ ఫలాలు ప్రజలకు అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు ప్రభుత్వానికి రాజకీయ నష్టాన్ని (Political Damage) కలిగించేలా ఉండటంతో ప్రస్తుతం ఈ అవినీతి పై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందోననే ఆసక్తి నెలకొంది.

మరోవైపు ప్రభుత్వం ఎన్ని సంక్షేమ, సంస్కృతి కార్యక్రమాలు చేపట్టినా... చివరికి విలీన గ్రామాల్లో పండుగ పూట కనీస వసతులు కల్పించలేకపోవడం వంటి ఘటనలు ప్రత్యర్థులకు ఆయుధంగా మారడంతో పాటు.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుందనే టాక్ వినిపిస్తుంది.

అదేవిధంగా తాజా పూలపై ఎలాంటి జీఎస్టీ లేకపోయినా, అధికారులే స్వయంగా 'జీఎస్టీ' పేరుతో రూ. 11,000 కట్ చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇది అధికార పార్టీపై అవినీతి ముద్ర వేసే అవకాశం ఉందని, కౌన్సిలర్లు సైతం నిధుల సర్దుబాటులో తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో వారికి పార్టీపై అసంతృప్తి పెరుగుతోందనే గుస గుసలు వినిపిస్తున్నాయి.

అలాగే ఈ అంశం గ్రామీణ ఓటర్లలో ప్రభుత్వ తీరుపై వ్యతిరేక భావనను సృష్టిస్తుందని అనుకుంటున్నారు. అందుకే ప్రభుత్వం విడుదల చేసే నిధులు క్షేత్రస్థాయిలో ఎక్కడికి వెళ్తున్నాయి. జీఎస్టీ పేరుతో జరుగుతున్న ఈ అక్రమ కోతలకు బాధ్యులు ఎవరనే అంశాలపై ఉన్నతాధికారులు వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తుంది.

బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వానికి జరుగుతున్న పొలిటికల్ డ్యామేజ్‌ను నివారించడం సాధ్యమవుతుందని జనం అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ అంశంపై స్థానిక అధికారుల నుంచి వివరణ కోరుతూ, సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న నిరసనలను పరిగణనలోకి తీసుకుని ఉన్నతాధికారులు తక్షణ దిద్దుబాటు చర్యలు తీసుకోవడం శ్రేయస్కరమని స్థానిక ప్రజా ప్రతినిధులు భావిస్తున్నారు.. అలాగే ఇంకా లోతైన విచారణ చేపట్టి ఇతర చోట్ల కూడా బతుకమ్మ నిధుల్లో జరిగిన గోల్ మాల్ బయటికి తీయాలని సూచిస్తున్నారు.

#MahabubabadNews#BathukammaFundScam#TelanganaGovt#Bathukamma2026#MahabubabadMunicipality#LocalGovernanceIssue#TelanganaPolitics#FundMismanagement#TelanganaNews#PublicGrievance
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి