తెలంగాణ

TG: సింగరేణి అధికారులకు పండుగ బొనాంజా!

రచన: Mahesh••3 నిమిషాల పఠనం

TG: పండుగ వేళ సింగరేణి ఉద్యోగులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే తీపి కబురు చెప్పింది. చాలా రోజులుగా వాళ్లు అడుగుతున్న మెయిన్ డిమాండ్‌ను పరిష్కరిస్తూ వేతనాల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కోల్ ఇండియాలో ఆఫీసర్లకు ఏ విధంగా అయితే శాలరీలు ఇస్తున్నారో.. సరిగ్గా అదే తరహాలో మన సింగరేణి అధికారులకు కూడా జీతాలు పెంచుతూ అధికారికంగా ఆర్డర్స్ ఇచ్చింది. దీంతో సింగరేణి ప్రాంతంలో పండుగ జోష్ మరింత పెరిగింది.

1,800 మంది అధికారులకు భారీ మేలు

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎగ్జిక్యూటివ్‌ కేడర్ 1 నుంచి 7 వరకు ఉన్న సుమారు 1,800 మంది అధికారులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. కోల్ ఇండియా లెవెల్‌లోనే ఇక్కడి అధికారులకూ జీతాలు రావడంతో వాళ్ల నెలవారీ శాలరీల్లో మంచి పెరుగుదల ఉండబోతోంది.

సెప్టెంబర్ 25 నుంచే అమలు

ఈ పెరిగిన జీతాల తాలూకు ప్రయోజనాలను సెప్టెంబర్ 25 నుంచే వర్తింపజేస్తున్నట్లు సర్కార్ వెల్లడించింది. వాస్తవానికి తమ జీతాల పెంపు విషయంపై సింగరేణి అధికారులు గతంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు. వాళ్ల సమస్యను అర్థం చేసుకున్న భట్టి విక్రమార్క.. ఇచ్చిన మాట ప్రకారమే అధికారుల జీతాలు పెరిగేలా చేసి పండుగ పూట ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ రావడంతో ఉద్యోగుల్లో ఖుషీ మొదలైంది.

#Telangana#Singareni Collieries#Singareni Officers#Salary Hike#Revanth Reddy#Bhatti Vikramarka#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి