సినిమా

Aadarsha Kutumbam: థమన్‌ని మళ్ళీ ట్రోల్ చేస్తారు..నో డౌట్!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Aadarsha Kutumbam: ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్‌లో ఎక్కువగా ట్రోల్ అయింది సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ మాత్రమే. కావాలని చేస్తాడా..అలా, కలిసొస్తుందా తెలియదు గానీ, థమన్ మ్యూజిక్ అందించిన సినిమాలలో ఒక్క పాటైనా కాపీ ట్యూన్ అని థమన్‌ని సోషల్ మీడియాలో ట్రోల్ చేసేస్తున్నారు. ఇప్పటికే, చాలాసార్లు ఇలా నెగిటివీని నెత్తిన మోశాడు. ఇప్పుడు, ఆదర్శ కుటుంబం విషయంలో మళ్ళీ అదే జరిగేలా ఉంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆదర్శ కుటుంబం. హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, ముఖ్య పాత్రలో నివేత పేతురాజ్ కనిపించబోతోంది. తాజాగా, ఈ సినిమా నుంచి "మాలా వచ్చా డు చూడూ" అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను ధనుంజయ, రనైనా రెడ్డి, థమన్ పాడారు. భానూ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.

అయితే, ఈ పాట వింటుంటే గతంలో సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ప్రతిరోజూ పండగే సినిమాలోని ఓ బావా..మా అక్కను సక్కాగ సూస్తావా అంటూ సాగే పాట ట్యూన్ మాదిరిగా ఉంది. విచిత్రం ఏమిటంటే ఈ సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కావడం. గతంలో, ఆయన వేరే సినిమాలలోని ట్యూన్స్ కాపీ కొడతాడనే మాట వినిపించేది..బాగా సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వచ్చేవి. ఓ ఇంటర్వ్యూలో థమన్ ని నేరుగానే ఈ విషయం అడిగితే లాజిక్ లేని ఆన్సర్ ఇచ్చి తోసేశాడు.

మళ్ళీ, ఇప్పుడు తను కంపోజ్ చేసిన ట్యూన్‌నే మళ్ళీ ఆదర్శ కుటుంబం కోసం రిపీట్ చేయడం దారుణం అని చెప్పాలి. మరి, సాంగ్ రికార్డ్ చేసినప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ వినలేదా..సాహిత్యం రాసేటప్పుడు రామజోగయ్యకి గుర్తు రాలేదా..నిర్మాతలకి ఇది రిపీటెడ్ ట్యూన్ అని తెలియలేదా అన్నది ఆసక్తికరమైన ప్రశ్న. పెద్దగా ఆలోచించకుండానే ఆదర్శక కుటుంబం నుంచి వచ్చిన 'మాలా వచ్చాడు చూడు' పాట వినగానే ప్రతిరోజూ పండగే అన్న సినిమాలోని పాట గుర్తొస్తోంది. మరి, సినిమా రిలీజైయ్యాక ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

#Aadarsha Kutumbam#Venkatesh#Srinidhi Setty#Nivetha Pethuraj#Trivikram#SS.Thaman
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి
YouTubeలో చూడండి ↗

తర్వాత చదవండి