Meenakshi Chaudhary: హీరోయిన్ అవ్వాలంటే ఒక అమ్మాయి ఎన్ని కష్టాలను అనుభవించాలో కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమాలో చూపించారు. ఇది వందకి వంద శాతం నిజమని ఆ తర్వాత చాలామంది సినీ తారలు ఒప్పుకున్నారు. ఇక్కడ, హీరోయిన్‌గా స్టార్ స్టేటస్ దక్కాలంటే కాంప్రమైజ్ కాక తప్పదని అంటుంటారు. తాజాగా, హాట్ బ్యూటీ మీనాక్షి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు, ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికరమైన చర్చగా మారింది.
డెంటిస్ట్ టు యాక్ట్రస్:
సాధారణంగా మన సినిమా ఇండస్ట్రీలో ఒక మాట వినిపిస్తుంది. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని. మిగతా వాళ్ళ విషయంలో ఏమో గానీ గ్లామర్ బ్యూటీ మీనాక్షీ చౌదరి విషయంలో మాత్రం ఇది నిజమే. వాస్తవానికి ఆమె దంత వైద్యురాలు. కానీ, సినిమాల మీద ఆసక్తితో ముందు మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. అక్కడ సక్సెస్ సాధించాక, సినిమాలలో అవకాశాలను అందుకుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది.
ప్రస్తుతం, మీనాక్షి చేతిలో అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న పాన్ ఇండియా సినిమా వృష కర్మ ఉంది. ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా వైడ్‌గా సత్తా చాటడానికి రెడీ అవుతోంది. డిసెంబర్ 4న ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఇంతకముందు వచ్చిన అనగనగా ఒకరాజు సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న మీనూ, ఒక్కో సినిమాను ఆచితూచి ఎంచుకుంటోంది. అయితే, తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ గురించి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇండస్ట్రీ వారిలో ఆలోచన కలిగేలా చేస్తోంది.
నా జీవితం గురించి ఎవరికీ వివరించాల్సిన అవసరం లేదని నా లైఫ్ ..నా ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీకొచ్చిన ప్రారంభంలో ఎన్నో ఒత్తిడులను, నెగిటివిటీని ఫేస్ చేసినట్టుగా చెప్పిన మీనాక్షి..కెరీర్‌లో ముందుకు సాగాలంటే..ఇలాంటివేమీ పట్టించుకోకూడదనే సంకల్పంతో తన కెరీర్ మీదే దృష్టి పెట్టినట్టుగా తెలిపింది. డెంటిస్ట్‌గా మంచి లైఫ్ లీడ్ చేయాల్సిన మీనూ తనకి నటన మీద ఉన్న ఆసక్తితోనే ఆ ఫీల్డ్ వదిలి ఇండస్ట్రీకొచ్చినట్టుగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం, ఈ గ్లామర్ బ్యూటీ చెప్పిన మాటలు..కొత్తగా ఇండస్ట్రీకొచ్చే అమ్మాయిలకి చక్కటి ఆదర్శంగా నిలిచాయి.


