Rapo 23-Rithesh: హ.హ.హాసిని అంటూ తెలుగు ప్రేక్షకులను బొమ్మరిల్లు సినిమాతో ఎంతగానో ఆకట్టుకున్న జెనీలియా దేశ్‌ముఖ్..ఆ తర్వాత తెలుగులో రెడీ, ఆరెంజ్, ఢీ, శశిరేఖా పరిణయం, నా ఇష్టం లాంటి సినిమాలు చేసింది. వాస్తవానికి, బొమ్మరిల్లు మూవీ కంటే ముందే సత్యం, నా అల్లుడు, సై, సాంబ, సుభాష్ చంద్రబోస్ లాంటి సినిమాలు చేసింది. కానీ, పాపులర్ అయింది మాత్రం బొమ్మరిల్లు సినిమాతోనే. అయితే, తాజాగా జెనీలియా భర్త బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ రామ్ పోతినేని సినిమాలో ఎంపికైయ్యాడు.
చాలాకాలంగా జెనీలియా మళ్ళీ టాలీవుడ్లో ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. గత మా ఎన్నికల్లోనూ ఈ బ్యూటీ హైదరాబాద్ వచ్చి మంచు విష్ణుని సపోర్ట్ చేస్తూ ఓటు వేసింది. ఆ సమయంలోనే మళ్ళీ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుందని ప్రచారం జరిగింది. అయితే, జెనీలియా తెలుగులో ప్రయత్నాలు చేసినా అవి వర్కౌట్ కాలేదు. దీనికి, కారణం ఇప్పుడు జెనీలియాను హీరోయిన్గా తీసుకోవడం కష్టం.
అలా అని క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తుందా.. అంటే అందుకు ఆమె ఒప్పుకోదు. జెనీలియాకి తెలుగుతో పాటు హిందీలోనూ మంచి పాపులారిటీ ఉంది. అయితే, ఇటీవల కాలంలో బాలీవుడ్ స్టార్స్ మన టాలీవుడ్లో క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్నారు. అందుకే, జెనీలియా సైలెంట్‌గా తన భర్త రితేష్‌ను టాలీవుడ్లో దింపే ప్రయత్నాలు చేసి సక్సెస్ అయింది. ఎట్టకేలకి, టాలీవుడ్ సినిమాలో రితేష్ ఓ ఛాన్స్ అందుకున్నాడు.
రెడీ తర్వాత జెనీలియా అండ్ ఫ్యామిలీతో రామ్ పోతినేనికి మంచి బాండింగ్ ఏర్పడింది. ఆ బాండింగ్ వల్ల ఈ ఎనర్జిటిక్ హీరో స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న రాపో 23లో విలన్ పాత్రకి రితేష్‌ను ఎంచుకున్నాడు. ప్రస్తుతం, హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ కొత్త షెడ్యూల్లో రితేష్ జాయిన్ అయ్యాడు. మొత్తానికి, జెనీలియా అనుకున్నది సాధించింది. ఈ సినిమా గనక హిట్ సాధిస్తే, తెలుగులో ఖచ్చితంగా రితేష్ కి మరిన్ని అవకాశాలు వస్తాయనడంలో సందేహమే లేదు. బాలీవుడ్లో నటుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. మరి, టాలీవుడ్ లో ఎంతవరకూ నిలబడతాడో చూడాలి.


