తెలంగాణ

Elnino: ఎల్ నినోపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

రచన: NK•••5 నిమిషాల పఠనం

ఎల్ నినో పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితులను సమీక్షించి, వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలను సిఫారసు చేసేందుకు క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఈ కమిటీకి చైర్మన్ గా నియమించారు. మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, వాకిటి శ్రీహరి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

Elnino: ఎల్ నినో పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితులను సమీక్షించి, వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలను సిఫారసు చేసేందుకు క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఈ కమిటీకి చైర్మన్ గా నియమించారు. మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, వాకిటి శ్రీహరి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు

రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి, సంబంధిత శాఖలకు అవసరమైన ఆదేశాలు, సూచనలు జారీ చేయడంతో పాటు తదుపరి చర్యలపై ప్రభుత్వానికి సిఫారసు చేయడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలపై సబ్ కమిటీ ఫోకస్ చేస్తుంది. తాగునీటి సమస్యలు తలెత్తకుండా సమీక్షలు నిర్వహించి చర్యలు తీసుకోనుంది.

రాష్ట్రంలో కరువు పరిస్థితులు

తెలంగాణపై ఎల్ నినో తీవ్రమైన ప్రభావమే చూపిస్తోంది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. తాగు, సాగు నీటికి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముందు ముందు ఈ సమస్యలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందన్న హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కోవడంపై రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. ముందుస్తు జాగ్రత్తతో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఆరుగురు సభ్యులు ఉన్నారు.

ఎంత నీరు ఉంది, ఏ విధంగా వాడుకోవాలి

రాష్ట్రంలో ఎంత మేరకు కరువు పరిస్థితులు ఉన్నాయి, ఎంత నీరు అందుబాటులో ఉంది, రిజర్వాయర్లలో వాటర్ కెపాసిటీ ఏంటి, ఉన్న నీటిని జాగ్రత్తగా ఏ విధంగా తాగేందుకు, సాగు కోసం వాడాలి.. ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు, ఎంత విస్తీర్ణంలో పంట నష్టం జరిగింది, రానున్న వేసవిలో ఏ రకంగా తాగునీటి వసతి కల్పించాలి.. ఈ మొత్తం అంశాలపై క్యాబినెట్ సబ్ కమిటీ చర్చించనుంది. నియోజకవర్గాలు, జిల్లాలు, మండలాల వారీగా వివరాలు తెప్పించుకుని సమీక్షించనున్నారు.

కోవిడ్ కంటే డేంజర్

ఇప్పటికే ఎల్ నినోను మహా విపత్తుగా పేర్కొన్నారు సీఎం రేవంత్. ఎల్ నినో కూడా కోవిడ్ లాంటిదే అన్నారు. కరోనాను ఏ విధంగా అందరం కలిసి ఎదుర్కొన్నామో అదే రీతిలో ఎల్ నినోను కూడా అంతా కలిసి ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నీటిని, విద్యుత్ ను అత్యంత పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలందరి సహకారం ఉంటేనే ఈ సమస్య నుంచి బయటపడగలమని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు.

#Elnino#Telangana#Cabinet Sub Committee#Cm Revanth#Drought#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి