National

Flydubai: విమానాన్ని నడిపిన ప్లంబర్.. పైలట్ స్మిత్ ఏమన్నారంటే?

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

Flydubai: ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన భయానక ఘటన తర్వాత ఒక వార్త ప్రపంచవ్యాప్తంగా తెగ చక్కర్లు కొట్టింది. విమానం గాల్లో ఉండగానే పైలట్ల మధ్య దాడి జరిగి అదుపుతప్పితే, ఓ ప్యాసింజర్ అయిన ప్లంబర్ కాక్‌పిట్‌లోకి దూరి టీవీ షో గుర్తొచ్చి విమానాన్ని కంట్రోల్ చేశాడని, అలా అందరి ప్రాణాలు కాపాడాడంటూ ఒక కథ విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. తాజాగా ఈ ప్రచారంపై నాడు కాక్‌పిట్‌లో ప్రాణాలతో పోరాడిన ఇండియన్ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ స్పందించారు.

నాకు ఆ ప్లంబర్ ఎవరో తెలీదు

యూఏఈలోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న స్మిత్ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పారు. "నిజం చెప్పాలంటే ఆ ప్లంబర్ కథేంటో నాకైతే అస్సలు తెలియదు. నాపై ఒక్కసారిగా దాడి జరిగినప్పుడు విమానం కిందపడిపోకుండా ఆపడం, నన్ను నేను కాపాడుకోవడం మీదే నా శక్తినంతా పెట్టాను. ఒక ప్లంబర్ నిజంగానే విమానాన్ని ల్యాండ్ చేయగలడా లేదా అనే ఊహాగానాల జోలికి నేను వెళ్లదల్చుకోలేదు" అని స్పష్టం చేశారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఒక సీనియర్ అధికారి 'విమానం కెప్టెన్ కంట్రోల్‌లోనే ఉంది' అని చెప్పడం మాత్రమే తనకు గుర్తుందన్నారు.

రక్తం కారుతున్నా డోర్ అన్‌లాక్ చేశా

దాడి తర్వాత కాక్‌పిట్‌లో పరిస్థితులు ఎలా మారాయో తనకు పూర్తిగా గుర్తులేదని స్మిత్ చెప్పారు. కో పైలట్ కత్తితో తనపై విచక్షణారహితంగా దాడి చేస్తున్నా, ఎలాగోలా ఎన్నో ప్రయత్నాలు చేసి సీట్‌బెల్ట్ విప్పుకుని కాక్‌పిట్ డోర్ తెరవగలిగానని తెలిపారు. ఆ డోర్ అన్‌లాక్ కావడంతోనే మిగతా వాళ్లు లోపలికి రావడం సాధ్యమైందని వివరించారు.

అసలు ఆ ప్లంబర్ ఏం చెప్పాడంటే

మరోవైపు ఇజ్రాయెల్‌కు చెందిన ప్లంబర్ యానివ్‌ హయూన్‌ మాత్రం నాడు తన వల్లే ప్రమాదం తప్పిందని చెప్పుకొచ్చాడు. తాను టీవీలో 'ఎయిర్‌క్రాష్‌ ఇన్వెస్టిగేషన్‌' షో చూసేవాడినని, కాక్‌పిట్‌లో గొడవతో ఫ్లైట్ అదుపు తప్పిన వెంటనే ఆ షో గుర్తొచ్చి కంట్రోల్ స్టిక్స్‌ను వెనక్కి లాగానని గతంలో తెలిపాడు. ఆ వెంటనే ఆఫ్ డ్యూటీలో ఉన్న మరో పైలట్ వచ్చి కంట్రోల్స్ తీసుకుని సౌదీ అరేబియాలోని తబుక్‌లో ఫ్లైట్‌ను సేఫ్‌గా దించారని నాడే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు వెల్లడించాడు. ప్లంబర్ చెప్పిన దానికి, స్వయంగా విమానాన్ని నడిపిన కెప్టెన్ స్మిత్ చెప్పిన మాటలకు పొంతన లేకపోవడంతో ఆ రోజు కాక్‌పిట్‌లో అసలేం జరిగిందనే దానిపై సరికొత్త చర్చ మొదలైంది.

#Flydubai#Captain Smith#Yaniv Hayun#Flydubai Incident#Aviation News#Aircraft Emergency
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి