సినిమా

Tollywood: దిల్ రాజు ని కాపాడేది రామాయణ?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Tollywood: తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతగా వెలుగుతున్న దిల్ రాజు..అంతకముందు డిస్ట్రిబ్యూటర్ అనే విషయం తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్ అయిన దిల్ రాజు, నిర్మాతగా మారి పలు విజయవంతమైన సినిమాలను నిర్మిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో నిర్మాతగా భారీ నష్టాలను చూశాడు. పంపిణీ చేసిన సినిమాలు అంతగా కలిసి రాలేదు. ఇప్పుడు, రామాయణ సినిమాను మన రెండు తెలుగు రాష్ట్రాలలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు దిల్ రాజు.

టాక్సిక్ వల్ల నష్టాలు:

ఇటీవల కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన పాన్ ఇండియా సినిమా టాక్సిక్ ని దిల్ రాజు ఇక్కడ రిలీజ్ చేశాడు. కానీ, ఇది ఒక ఒప్పందం ప్రకారం జరిగింది. సినిమా హిట్ సాధిస్తే ఓకే. ఒకవేళ ఫ్లాపైతే డిస్ట్రిబ్యూటర్స్‌కి 45 రోజుల్లో కొన్న మొత్తాన్ని యష్ అండ్ నిరాణ సంస్థ కేవిఎన్ వారు తిరిగి ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ రకంగా, టాక్సిక్ డిజాస్టర్ అయినా కూడా రాజుగారు సేఫ్ అయ్యారు.

4000 కోట్ల ప్రాజెక్ట్ రామాయణ:

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న రామాయణ రెండు భాగాలుగా వస్తోంది. మొదటి భాగం ఈ దీపావళి సందర్భంగా నవంబర్ లో రిలీజ్ కాబోతోంది. రెండవ భాగం 2027, దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ కాబోతోంది. అయితే, మన ఏపీ అండ్ తెలంగాణాలలో దిల్ రాజు ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తాజాగా, ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది.

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో యష్ రావణ పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు, నిర్మాణంలో ఆయన కూడా భాగమవడం విశేషం. ఇప్పటికే ఈ సినిమాపై నార్త్ అండ్ సౌత్ మార్కెట్‌లో మంచి హైప్ నెలకొంది. అయితే, కొన్ని విషయాలలో రామాయణ కూడా నెగిటివిటీని ఎదుర్కొంటోంది. మరి, ఈ సినిమా రిలీజైయ్యాక ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో..రెండవ భాగానికి ఈ సినిమా ఎలా బలాన్ని చేకూర్చుతుందో చూడాలి. ముఖ్యంగా, నష్టాలలో ఉన్న దిల్ రాజును రామాయణ ఎంతవరకూ లాభాలలోకి లాక్కొస్తుందో అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.

#Dil Raju#SVC#Ramayana#Ranbeer Kapoor#Sai Pallavi
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి