Tollywood: ఒక్క సినిమాతో హిట్ కొట్టిన దర్శకులు రెండవ సినిమాకి మాత్రం తడబడి ఫ్లాప్ చూస్తున్నారు. దీని, వల్ల మొదటి సినిమా ఇచ్చిన సక్సెస్..మర్చిపోయి..అవకాశాలిచ్చే హీరోలు, నిర్మాతలు వెనక్కి తగ్గుతున్నారు. ఈ మధ్య కాలంలో డెబ్యూ సినిమాతో సూపర్ హిట్ కొట్టి వరుసగా రెండు మూడు ఆఫర్స్ అందుకున్న దర్శకులు, రెండవ సినిమా ఊహించని విధంగా ఫ్లాప్ కావడంతో చేతికి వచ్చిన అవకాశాలు జారిపోతున్నాయి. అలా, 'ది ప్యారడైజ్' దర్శకుడి క్రేజ్ ప్రాజెక్ట్ ఇప్పుడు డైలమాలో పడిందట.
దసరా సినిమాతో మంచి కమర్షియల్ హిట్ అందుకున్నాడు యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. దీంతో, నానితో ఒక సినిమా, మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమాను చేసే ఛాన్సులు అందుకున్నాడు. అధికారికంగా కూడా ప్రకటించారు. కానీ, శ్రీకాంత్ ఇటీవల నానితో తీసిన 'ది ప్యారడైజ్' సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. ముఖ్యంగా, రెండవ సినిమాను భారీ పాన్ ఇండియా స్కేల్లో చేయాలనుకోవడమే శ్రీకాంత్ వేసిన రాంగ్ స్టెప్.
ఫ్యామిలీ, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో గనక మీడియం బడ్జెట్ సినిమాను చేసి ఉంటే ఇలాంటి ఇబ్బందులు వచ్చేవి కావు. కానీ, ది ప్యారడైజ్ సినిమాను అటెంప్ట్ చేయడం వల్ల అనుభవం లేదనే విషయం అందరికీ అర్థం అయింది. దాంతో, నాని నిర్మాణంలో శ్రీకాంత్ ఓదెల-చిరంజీవి ప్రాజెక్ట్ హోల్డ్ అయింది. ఇప్పుడు, శ్రీకాంత్ పరిస్థితి ఏంటీ? అనేది ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చగా మారింది.
RX 100 తర్వాత అజయ్ భూపతి ట్రాక్ తప్పాడు:
రాంగోపాల్ వర్మ దగ్గర అసోసియేట్‌గా చేసి దర్శకుడైన అజయ్ భూపతి మొదటి సినిమా ఆర్ఎక్స్ 100 చిత్రాన్ని తీసి మంచి కమర్షియల్ సక్సెస్‌ను అందుకున్నాడు. ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో మహాసముద్రం తీస్తే అది డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత పాయల్ రాజ్‌పుత్‌తో మంగళవారం తీసి ఓ మోస్తరు హిట్ అందుకున్నాడు. దీని తర్వాత శ్రీనివాస మంగాపురం తీసి మళ్ళీ డిజాస్టర్ చూశాడు. కొందరు దర్శకులు మొదటి సినిమా వరకూ పాస్ అవుతున్నారు. రెండవ సినిమా నుంచి తమలోని అసలు టాలెంట్ బయటపడుతోంది. దీనివల్ల కెరీర్ ట్రాక్ తప్పుతోంది.


