తెలంగాణ

TG : దసరా ఎఫెక్ట్.. నాన్‌‌వెజ్ ప్రియులకు షాక్

రచన: Kumar••4 నిమిషాల పఠనం

దసరా పండుగ సందర్బంగా నాన్ వెజ్ ప్రియులకు షాక్ తగిలింది. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో మాంసం ధరలు కొండెక్కినట్టు తెలుస్తోంది.రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా ధరల్లో మార్పులు ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్‌లో కిలో స్కిన్‌ లెస్ చికెన్ ధర రూ.300 నుంచి రూ. 320 వరకు పలుకుతున్నట్టు తెలిసింది.

దసరా పండుగ సందర్బంగా నాన్ వెజ్ ప్రియులకు షాక్ తగిలింది. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో మాంసం ధరలు కొండెక్కినట్టు తెలుస్తోంది.రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా ధరల్లో మార్పులు ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్‌లో కిలో స్కిన్‌ లెస్ చికెన్ ధర రూ.300 నుంచి రూ. 320 వరకు పలుకుతున్నట్టు తెలిసింది. వరంగల్, కామారెడ్డి వంటి జిల్లాల్లో రూ.280 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నట్టు సమాచారం.

ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సహా ప్రధాన నగరాల్లోనూ కిలో చికెన్ ధర దాదాపు రూ.280 నుంచి రూ.300 మధ్యలో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మటన్ ధరలు కూడా స్వల్పంగా పెరిగినట్టు తెలుస్తోంది. మేక, పొట్టేలును బట్టి కిలోకు రూ. 700 నుంచి రూ. 1,100 వరకు విక్రయిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా డిమాండ్ అధికంగా ఉన్నట్టు విక్రయదారులు చెబుతున్నారు.

పండుగను దృష్టిలో పెట్టుకుని మార్కెట్‌లో మీట్ సరఫరాకు లోటు లేకుండా చర్యలు తీసుకున్నప్పటికీ కొన్ని చోట్ల అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. దసరా నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లోని చికెన్, మటన్ విక్రయ కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచే మాంసం ప్రియులు పెద్ద ఎత్తున బారులు తీరారు. కొన్ని చోట్ల గంటల సమయం పడుతున్నట్టు తెలుస్తోంది.

విజయదశమి నాడు ఇంట్లో ముక్క, సుక్క లేకుండా తెలంగాణలో పండుగ సెలబ్రేషన్స్ ఉండవు. ఈ క్రమంలోనే ఏపీతో పోలిస్తే తెలంగాణలో మాంసం డిమాండ్ భారీగా ఏర్పడినట్టు తెలిసింది. ఉదయం 5 గంటల నుంచే మాంసం దుకాణాల వద్ద తీవ్ర రద్దీ నెలకొనడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పలుచోట్ల ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఇదిలాఉండగా, కొన్ని చోట్ల పండుగకు ముందు రోజు రాత్రే మాంసం తెచ్చిపెట్టుకోవడంతో ట్రాఫిక్ రద్దీ తగ్గినట్టు తెలుస్తోంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలు తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మాంసం కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

#Nonveg#prices#increase#hyderabad#Telangana#andrapradesh#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి