Balakrishna: దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందిస్తున్న జైలర్ ఫ్రాంఛైజీస్ నుంచి తాజాగా ఓ వార్త బయటకి వచ్చి అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్లో ఆసక్తికరమైన చర్చగా సాగుతోంది. జైలర్, జైలర్ 2 చిత్రాలు భారీ కమర్షియల్ విజయాలను అందుకున్నాయి. తాజాగా వచ్చిన జైలర్ 2 బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. అయితే, ఈ సినిమాలో బాలకృష్ణ ఓ కామియో రోల్ చేయాల్సి ఉండగా, ఆ పాత్రకి స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఉందని బాలయ్య సున్నితంగా తిరస్కరించారట.
జైలర్ 3లో బాలయ్య పక్కా!
జైలర్, జైలర్ 2 చిత్రాలతో సూపర్ స్టార్ రజినీకాంత్‌కి నెల్సన్ సాలీడ్ కమర్షియల్ హిట్స్ ఇచ్చాడు. ఈ క్రమంలో జైలర్ 3 కూడా ఉండబోతుందని క్లైమాక్స్‌లో రివీల్ చేశారు. సీక్వెల్ మూవీస్ ఇంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయడం..అది కూడా ఒక సూపర్ స్టార్‌తో అంత సులభం కాదు. కానీ, ఇతర కామియోలలో మిగతా భాషల్లో స్టార్స్ కూడా నటిస్తున్న జైలర్ ఫ్రాంఛైజీస్ని చకచకా పూర్తి చేస్తున్నాడు నెల్సన్. అందుకే, రజినీ కానివ్వండీ..కామియో చేస్తున్న స్టార్స్ కానివ్వండీ డేట్స్ అడగగానే ఇస్తున్నారు. అందుకే, ఈ సారి జైలర్ 3కోసం బాలయ్యను లాక్ చేయబోతున్నాడట నెల్సన్.
జైలర్ 2లో బాలయ్యకి చెప్పిన పాత్ర స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉందనే బాలయ్య రిజెక్ట్ చేశాడు. ఆ పాత్రనే బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే, ఈసారి మాత్రం పార్ట్ 3 కోసం బాలయ్య కోరిక మేరకు పవర్ ఫుల్‌గా, స్క్రీన్ స్పేస్ బాగా ఎక్కువ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట నెల్సన్. అంతేకాదు, ఈసారి బాలయ్య జైలర్ 3 కోసం ఒప్పుకునేవరకూ పట్టువిడవని విక్రమార్కుడిలా ఆయన కోసం ఎదురుచూస్తాడట.
రజినీకాంత్‌కి మన టాలీవుడ్ స్టార్స్ అంటే ఎంతో ఇష్టం. అంతేకాదు, ఒకప్పుడు ఫ్యాక్షన్ సినిమాలు చేయాలంటే బాలయ్య తప్ప ఇంకెవరికీ అవి సూటవవని..బాలయ్య తొడ కొట్టినా, కన్నెర్ర చేసినా ప్రేక్షకులు ఒప్పుకుంటారని..ఆ సన్నివేశాలు ఇంకే హీరో చేసినా ఒప్పుకోరని రజినీ బాలయ్య ఫ్యాన్ ఫాలోయింగ్‌పై ప్రశంసలను కురిపించారు. కాబట్టి, బాలయ్యకి నిజంగా జైలర్ 3లో పాత్ర నిడివి ఎక్కువగా ఉండి కథలో కీలకమైతే గ్యారెంటీగా ఒప్పుకుంటారు. అదే, జరిగితే..ఈసారి జైలర్ 3లో రజినీ-బాలయ్యల పర్ఫార్మెన్స్కి థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం.


