తెలంగాణ

Telangana: ఎల్‌నినో ఎఫెక్ట్.. విమర్శలకు ఛాన్స్ ఇవ్వకుండా ప్రణాళికలు సిద్దం చేసిన రేవంత్ సర్కార్!!..

రచన: Venu••10 నిమిషాల పఠనం

కళకళలాడే తుంగభద్ర నది, ఈసారి ఎల్ నినో ప్రభావంతో కన్నీరు పెట్టిస్తుంది. ఎగువన ఉన్న కర్ణాటకలో వర్షాభావం తీవ్రమవ్వడంతో కనుచూపు మేరలో కూడా సుంకేసుల బ్యారేజీ వద్ద నీటి జాడలు కనిపించడం లేదు.

ఎప్పుడు జలకళతో పొంగిపొరలాడుతూ, నిరంతరం నిండు కుండలా ప్రవహించే తుంగభద్ర నది.. ఈ సంవత్సరం ఎల్ నినో ప్రతాపంతో వరుణుడి కరుణ లేక బోసిపోయింది. సహజంగానే ఎల్లప్పుడూ సమృద్ధిగా నీరు ఉండే ఈ నదీ తన నిత్య జలకళతో ఈ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తోంది.

కళకళలాడే తుంగభద్ర నది, ఈసారి ఎల్ నినో ప్రభావంతో కన్నీరు పెట్టిస్తుంది. ఎగువన ఉన్న కర్ణాటకలో వర్షాభావం తీవ్రమవ్వడంతో కనుచూపు మేరలో కూడా సుంకేసుల బ్యారేజీ వద్ద నీటి జాడలు కనిపించడం లేదు. పారే నది కాస్తా ఎడారిలా మారిపోవడంతో.. ప్రత్యామ్నాయాల కోసం రైతన్నలు పడుతున్న వేదన వర్ణనాతీతంగా మారింది.

చుక్క నీరు కూడా దిగువ ప్రాంతాలకు పారని దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కన్నెర్ర చేసిన ప్రకృతి ప్రకోపానికి జనం అల్లాడిపోతుండగా.. రాబోయే వేసవిలో రోజుల్లో నీటి తిప్పలు ఊహకు కూడా అందడం లేదు.. దీంతో స్థానికులు తల్లడిల్లిపోతున్నారు. మరోవైపు సుంకేసుల బ్యారేజీ పైన ఉన్న తుమ్మిళ్ల నీటి ప్రవాహం కూడా పూర్తిగా పడిపోయి రైతన్నల కంట కన్నీరు పెట్టిస్తుంది. ఇప్పటికే కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పంటలు కళ్లముందే ఎండిపోతుంటే ఏమి చేయలేని నిస్సాహాయత రైతుల్లో నెలకొంది.

అదేవిధంగా రానున్న రోజుల్లో సాగు నీరు దొరకక ఎకరాకి ఎంత నష్టం వస్తుందోనని అన్నదాతలు లెక్కలు వేసుకుంటూ.. చేసిన అప్పులను తలచుకుంటూ దిగాలు పడుతున్నారు. రోజులు ఎలా గడిచి పోతాయో తెలియక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.. మరోవైపు ముంచుకొస్తున్న ఎల్‌‌నినో ప్రభావాన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది.

గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు దండోరా పేరుతో.. రానున్న రోజుల్లో ఎదురయ్యే తీవ్ర నీటి కొరత, విద్యుత్ డిమాండ్‌‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని నవంబర్ 1వ తేదీ నుండి అమల్లోకి తేవడానికి సిద్దం అవుతుంది. ఇక ప్రస్తుతం విద్యుదుత్పత్తి, డిమాండ్‌‌తో పాటు జలాశయాల్లో నీటి నిల్వల లెక్కలను పరిశీలించిన ప్రభుత్వం.. రాబోయే ఏడాది కాలానికి తాగునీటి నిల్వలను ప్రాజెక్టులవారీగా కేటాయిస్తూ బ్లూప్రింట్ ఖరారు చేసింది.

ఇందులో భాగంగా ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై పక్కా లెక్కలు సేకరించింది. ఇక అధికారులు సమర్పించిన తాజా నివేదికల ప్రకారం.. మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ జిల్లాలోని కొయిల్ సాగర్ ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్ 411.33 మీటర్లు కాగా, ప్రస్తుత వాటర్ లెవల్ 407.43 మీటర్ల వద్ద 0.983 టీఎంసీల నిల్వ ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే నల్గొండ జిల్లా ఉదయసముద్రంలో 220 మీటర్ల ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుగానూ 1.525 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు..

అదేవిధంగా ఖమ్మం జిల్లా పాలేరులో 133.90 మీటర్ల ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 2.558 టీఎంసీలు, ఆకేరులో 245 మీటర్ల ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 1.5 టీఎంసీల నీరు ఉన్నదని నివేదికలు చెబుతున్నాయి.. ఇక వైరా ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 95.88 మీటర్ల లెవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 2.523 టీఎంసీలు, టెయిల్ పాండ్ వద్ద 75.50 మీటర్ల మట్టంతో 7.080 టీఎంసీలు, నాగార్జునసాగర్ పరిధిలోని పెండిపాకాల వద్ద 148.58 మీటర్ల వద్ద 1.03 టీఎంసీల నీటి నిల్వలు అందుబాటులో ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

మరోవైపు గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్ 318.52 మీటర్లు కాగా ప్రస్తుతం 9.657 టీఎంసీల నిల్వ ఉందని పేర్కొన్నారు. ఇక నెలకు 0.600 టీఎంసీల చొప్పున నాగార్జునసాగర్, జూరాల ఆధారిత తాగునీటి పథకాలకు అవసరం కాగా.. మున్సిపాలిటీలు , 320 గ్రామీణ ప్రాంతాలు, మరో 2 అదనపు ఆవాసాలకు గ్రావిటీ, లిఫ్ట్ స్కీముల ద్వారా రాబోయే 339 రోజులకు సరిపడా నీరందించేలా పక్కా ప్రణాళిక రచించారు.

ఇదే తరహాలో గోదావరి బేసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని రిజర్వాయర్ల తాగునీటి నిల్వలను తేల్చిన ఇంజనీర్లు.. నిర్మల్ జిల్లాలోని గడ్డెన్న ప్రాజెక్టు ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్ 358.70 మీటర్లు కాగా, ప్రస్తుత మట్టం 357.10 మీటర్ల వద్ద ఒక టీఎంసీల నీరు ఉందని తెలిపారు.. అదేవిధంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 332.53 మీటర్ల గరిష్ట మట్టానికి గాను ప్రస్తుతం +328.605 మీటర్ల వద్ద 48.583 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి.

అలాగే కుమ్రం భీమ్ ప్రాజెక్టులో 148 మీటర్ల వద్ద 2.018 టీఎంసీలు, కడెం ప్రాజెక్టులో 213.36 మీటర్ల వద్ద 2.839 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నట్టు వివరించారు. ఇక పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లిలో +148 మీటర్ల ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గాను 142.29 మీటర్ల వద్ద 18.175 టీఎంసీలు, అలాగే సిరిసిల్లలోని మిడ్ మానేరు ప్రాజెక్టులో +318.00 మీటర్ల ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 316.33 మీటర్లతో 23.420 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నట్టు తెలిపారు.

కరీంనగర్ లోయర్ మానేరులో 290.48 మీటర్ల వద్ద 15.425 టీఎంసీలు, మల్లన్నసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో +557.00 మీటర్ల ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గానూ 12.780 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్టు నిర్ధారించారు. ఈ క్రమంలో గోదావరి పరివాహక గ్రామాలు, పట్టణాల్లో నీటి ఎద్దడి రాకుండా ఈ ప్రాజెక్టుల నుండి నిరంతరంగా నీటి సరఫరాకు ప్రణాళికలు సిద్దం చేశారు.. మరోవైపు మిషన్ భగీరథ, గ్రామీణ మంచినీటి సరఫరా వ్యవస్థల కింద రాష్ట్రవ్యాప్తంగా తాగు నీరు అందించేందుకు మొత్తం 62 జలాశయాలను అనుసంధానించారు.

ఇందులో గోదావరి బేసిన్ పరిధిలోని 26 జలాశయాలు, కృష్ణా బేసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 36 రిజర్వాయర్లు పూర్తిస్థాయి మంచినీటి అవసరాలకు ప్రధాన మూలాధారంగా ఉన్నాయి. 2026 అక్టోబర్ నుంచి 2027 అక్టోబర్ వరకు రోజువారీ ఎండల తీవ్రత, నీటి ఆవిరి నష్టాలు లెక్కగడుతూ.. వాటర్ లెవల్ డెడ్ స్టోరేజ్ కంటే దిగువకు వెళ్లినప్పుడు అత్యవసర పంపింగ్ మోటార్లు అమర్చి, ప్రత్యేక ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టేక్ ఏర్పాట్ల ద్వారా చివరి బొట్టు వరకు తోడి తాగునీటి సరఫరాకు ఎక్కడా లోటు రాకుండా చేయాలని ఆదేశించారు.

ఇందుకోసం అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించిన సీఎం.. మిషన్ భగీరథ పంపింగ్ స్టేషన్లు, విద్యుత్ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్ల పరిధిలో సరఫరాకు ఏ చిన్న విఘాతం కలిగినా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. ఇక ఈ విపత్కర పరిస్థితులను క్షేత్రస్థాయి నుంచి పర్యవేక్షించేందుకు సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 24 గంటలూ పనిచేసే ప్రత్యేక కంట్రోల్ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కూడిన వార్ రూమ్ ను ఏర్పాటు చేశారు.

ప్రజలకు నిరంతరం తాగునీరు అందించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ప్రజలు కూడా పొదుపు సూత్రాలను పాటించాలని, కరెంట్, నీరు వృధా చేయకుండా వాడుకోవాలని అధికారులు సూచించారు.. అందరూ సమిష్టిగా ఈ విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్దం అవ్వాలని పేర్కొన్నారు..

#ElNinoImpact#TelanganaWaterCrisis#TungabhadraRiver#DroughtInTelangana#FarmersInDistress#WaterScarcity2026#SunkesulaBarrage#TelanganaNews#Revanth government
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి