క్రీడలు

Para Asian games : స్వర్ణం సాధించిన తెలంగాణ స్టార్ అథ్లెట్..

రచన: Kumar••3 నిమిషాల పఠనం

పారా ఏషియన్ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారిణి మరోసారి సత్తా చాటారు. భారత జాతీయ పతాకాన్ని విదేశీ గడ్డపై సగర్వంగా ఎగరేశారు. పారా ఏషియన్ గేమ్స్-2026లో రాష్ట్రానికి చెందిన అథ్లెట్ దీప్తి జివాంజీ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారు.

పారా ఏషియన్ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారిణి మరోసారి సత్తా చాటారు. భారత జాతీయ పతాకాన్ని విదేశీ గడ్డపై సగర్వంగా ఎగరేశారు. పారా ఏషియన్ గేమ్స్-2026లో రాష్ట్రానికి చెందిన అథ్లెట్ దీప్తి జివాంజీ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారు. మహిళల 400 మీటర్ల రన్నింగ్ విభాగం ఫైనల్లో అద్భుతమైన వేగంతో దూసుకెళ్లారు. కేవలం 56.36 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకుని బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు.

పరుగు ప్రారంభం నుంచే పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ప్రత్యర్థులను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. పారా ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు ఇది 5వ స్వర్ణ పతకం కావడం విశేషం. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి అంతర్జాతీయ ట్రాక్‌లపై నిలకడగా రాణిస్తున్న దీప్తి.. 2024 పారిస్ పారాలింపిక్స్‌లోనూ కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించారు.తాజాగా పసిడి పతకం సాధించడంతో ఆమె విజయాన్ని అందరూ కీర్తిస్తున్నారు.

ఇదిలాఉండగా, మరోవైపు టేబుల్ టెన్నిస్ విభాగంలో స్టార్ పారా ప్లేయర్ భవినా పటేల్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. పారా ఏషియన్ గేమ్స్‌లో భారత పతకాల సంఖ్య ప్రస్తుతం 13కు చేరుకుంది. దీప్తి జివాంజీ సాధించిన ఈ చారిత్రక విజయంతో తెలంగాణ క్రీడా వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

పట్టుదల,నిరంతర కఠోర శ్రమతో దేశానికి బంగారు పతకాన్ని అందించిన తెలంగాణ ముద్దుబిడ్డ దీప్తిని పలువురు ప్రముఖులు, క్రీడాభిమానులు అభినందించారు. అంతర్జాతీయ వేదికపై దేశ గౌరవాన్ని నిలబెడుతూ దేశ పారా అథ్లెట్లు అద్భుతమైన ప్రతిభను చాటుతున్నారని క్రీడా వర్గాలు కొనియాడాయి.

#para athelet games#deepthi jevanji#gold medal#running race#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి