సినిమా

SS Rajamouli: ఆరేడు సినిమాలు కలిపితే వారణాసి..

రచన: Anshu••4 నిమిషాల పఠనం

SS Rajamouli: గతకొంతకాలంగా సీక్వెల్స్ మీద మన మేకర్స్ దృష్టి పెడుతున్నారు. కథను లార్జర్ దాన్ లైఫ్ అన్న రీతిలో తయారు చేసి రెండు లేదా మూడు భాగాలుగా రూపొందిస్తున్నారు. వీటికి, సీక్వెల్స్, ఫ్రాంఛైజీస్, ఛాప్టర్స్ అంటూ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తాజాగా వారణాసి సినిమా గురించి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇచ్చిన స్టేట్‌మెంట్ చూస్తే కొన్ని సినిమాలను కలిపితే ఒక్క వారణాసి అవుతుందనిపిస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతోన్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి మీదే మన ఇండియన్ మేకర్స్‌తో పాటు హాలీవుడ్ మేకర్స్ దృష్టి ఉంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజవుతుందా.! అని అందరూ ఎదురుచూస్తున్నారు. రాజమౌళి కూడా ఇంటర్నేషనల్ మార్కెట్‌ను టార్గెట్ చేసి ప్రస్తుతం, హాలీవుడ్ మీడియాలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. 1400 కోట్ల భారీ బడ్జెట్ సినిమా కావడంతో జక్కన్న వేస్తున్న ప్లాన్స్ అన్నీ పాన్ వరల్డ్ రేంజ్‌లో ఉన్నాయి. ఇక, ఈ సినిమాను ఆరేడు సినిమాలు కలిపి తీసినట్టుగా ఉంటుందని జక్కన్న చెప్పడం విపరీతమైన అంచనాలను పెంచేసింది.

బాలీవుడ్‌లో ధురంధర్:

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య వసూళ్ల సునామీని సృష్ఠించిన సినిమా ధురంధర్ రెండు భాగాలు. అంతకముందు వరకూ మన తెలుగు సినిమాల రికార్డ్స్ గురించి మాట్లాడుకున్నారు. కానీ, మళ్ళీ చాలా ఏళ్ళకి హిందీలో ధురంధర్ సినిమాలు సంచలనం సృష్ఠించాయి. వాస్తవానికి, ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని ముందు అనుకోలేదు. మొదటి భాగం భారీ అయిన నేపథ్యంలో ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించారు. మొదటి భాగానికంటే రెండవ భాగం కమర్షియల్‌గా భారీ లాభాలను తెచ్చింది.

కాంతార:

కన్నడలో భారీ హిట్ సాధించిన కాంతార కూడా ఛాప్టర్స్ గా వస్తోంది. ఇప్పటికే, రెండు భాగాలుగా వచ్చిన కాంతార భారీ విజయాన్ని అందుకుంది. మన టాలీవుడ్‌లో అల్లు అర్జున్ నటించిన పుష్ప కూడా రెండు భాగాలుగా వచ్చింది. ఈ రెండు భాగాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ ఫ్రాంఛైజీస్‌లో మూడవ భాగం కూడా ఈ సినిమా నుంచి రాబోతుంది. అలాగే, సలార్..జైలర్ సినిమాల నుంచి ఫ్రాంఛైజీస్ రాబోతున్నాయి. కానీ, వారణాసి సినిమాలో మాత్రం ఆరేడు కథలన్నీ కలిసి ఉండబోతున్నాయి. మరి, ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ఎలాంటి సంచలన రికార్డ్స్‌ను నమోదు చేస్తుందో చూడాలి.

#SS Rajamouli#Mahesh Babu#Varanasi#Priyanka Chopra
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి