సినిమా

Nivetha Pethuraj: ఈసారి గురూజీ కాస్త సెకండ్ లీడ్‌ను వాడాడుగా!

రచన: Anshu•••4 నిమిషాల పఠనం

Nivetha Pethuraj: విక్టరీ వెంకటేష్, కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఆదర్శ కుటుంబం నుంచి ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’ వచ్చి ఆకట్టుకుంది. ఈ క్రమంలో, తాజాగా ఈ సినిమా నుంచి రెండవ పాట ‘మాలా’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Nivetha Pethuraj: విక్టరీ వెంకటేష్, కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఆదర్శ కుటుంబం నుంచి ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’ వచ్చి ఆకట్టుకుంది. ఈ క్రమంలో, తాజాగా ఈ సినిమా నుంచి రెండవ పాట ‘మాలా’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొంత నెగిటివిటీ వస్తున్నప్పటికీ మాస్ ఆడియన్స్‌ను ఈ సాంగ్ బాగానే ఆకట్టుకుంది.

‘ఆదర్శ కుటుంబం’ సినిమా వాస్తవానికి ఈపాటికే విడుదల కావాల్సి ఉంది. కానీ, వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఇంకా విడుదల తేదీని ప్రకటించలేదు. ముందు, ఈ సినిమాను అక్టోబర్ 2న రిలీజ్ చేస్తామని అన్నారు. ఆ తర్వాత అక్టోబర్ 9న అని ప్రకటించారు. కానీ, ఈ రెండు తేదీలలో సినిమా రిలీజ్ కాలేదు. కానీ, ఈ నెలాఖరున వచ్చే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది.

అంతేకాదు, నవంబర్ చివరి వారంలో రిలీజ్ చేస్తారని ఒక మాట వినిపిస్తుంటే..ఏకంగా 2027కి షిఫ్ట్ అయిందని మరో వార్త వైరల్ అవుతోంది. కానీ, మేకర్స్ ఇవేవీ పట్టించుకోవడం లేదు. ఈ అక్టోబర్ 30న రిలీజ్ చేస్తున్నట్టుగా దసరా పండుగను పురస్కరించుకొని పోస్టర్ ద్వారా వెల్లడించారు. ప్రమోషన్స్ మొదలుపెట్టి వరుసగా సాంగ్స్ వదులుతున్నారు. ఈ మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా థమన్ కంపోజ్ చేసిన మాలా సాంగ్ వచ్చింది. అయితే, ఈ పాట గతంలో వచ్చిన ఓ సినిమా సాంగ్ ట్యూన్ కాపీలా ఉందని ప్రచారమూ జరుగుతోంది.

ఈ విషయం పక్కన పెడితే, త్రివిక్రమ్ సినిమాలలో ముందు సెకండ్ లీడ్‌కి మంచి స్క్రీన్ స్పేస్ ఉందంటారు. కానీ, సినిమా రిలీజైయ్యాక చూస్తే..ఇంత చిన్న పాత్రకి హీరోయిన్ అవసరమా? అనే కామెంట్స్ వినిపిస్తాయి. గుంటూరు కారం మూవీలో మీనాక్షి చౌదరి గురించి..అరవింద సమేతలో ఈషా రెబ్బ గురించి ఇలాగే మాట్లాడుకున్నారు. అందుకేనేమో, ఆదర్శ కుటుంబంలో మాత్రం గ్లామర్ బ్యూటీ నివేతా పేతురాజ్‌ను బాగానే వాడాడు. తాజాగా వచ్చిన మాలా సాంగ్‌లో ఆమె అందాల ఆరబోత చూస్తే ఈసారి గురూజీ సెకండ్ లీడ్‌ను కూడా బలమైన పాత్రలో చూపించబోతున్నాడని అర్థమవుతోంది.

#Aadarsha Kutumbam#Venkatesh#Trivikram#Srinidhi Setty#Nivetha Pethuraj
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి