International

Trump : ముస్లిం సిటీగా మారనున్న ‘పారిస్’.. ట్రంప్ సంచలన కామెంట్స్

రచన: Kumar••4 నిమిషాల పఠనం

ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరం తగలబడుతోంది. నిరసనలు కారులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేయడం, షాపులు లూటీ చేయడం, అడ్డుకోబోయిన పోలీసుల మీద దాడులకు తెగబడుతున్నారు. అల్లర్లు తీవ్ర రూపం దాల్చడంతో ఆ దేశంలో ఎమర్జెన్సీ విధించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరం తగలబడుతోంది. నిరసనలు కారులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేయడం, షాపులు లూటీ చేయడం, అడ్డుకోబోయిన పోలీసుల మీద దాడులకు తెగబడుతున్నారు. అల్లర్లు తీవ్ర రూపం దాల్చడంతో ఆ దేశంలో ఎమర్జెన్సీ విధించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వాహనాలకు నిప్పు పెట్టడంతో పాటు దాడులు, దోపిడీలు పెరిగిపోయాయి. అల్లర్లు,నిరసనలను కట్టడి చేసేందుకు ఆర్మీని రంగంలోకి దించాలని ఫ్రాన్స్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది.

అయితే, ఆ నిరసనలు చెలరేగడానికి కారణం ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకడం, నిరుద్యోగం, గృహాలు దొరకకపోవడం, పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత, ఉపాధ్యాయుల లోటు అని అంతర్జాతీయంగా కథనాలు వస్తున్నాయి. గత నెల సెప్టెంబర్ నుంచి ఫ్రాన్స్ పౌరులు తీవ్ర ఆందోళనలకు దిగారు. ఈ నిరసనల కారణంగా అక్కడి పరిస్థితులు రోజురోజుకూ దిగ జారిపోతున్నాయి. దేశంలోని పలు ప్రాంతాలు యుద్ధ క్షేత్రాలను తలపిస్తున్నాయి. అయితే, ఫ్రాన్స్‌లో చెలరేగిన అల్లర్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

వాషింగ్టన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఆందోళనలకు పాఠశాలల సమస్యలు, లేదా ఇతర కారణాలు కాదని, కేవలం వలసలే ప్రధాన కారణమని స్పష్టంచేశారు. తాను పలుమార్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో మాట్లాడానని చెప్పారు. వలసవాదులను విపరీతంగా ప్రోత్సహిస్తూ ఫ్రాన్స్ తప్పు చేస్తోందని ఇప్పటికే చెప్పానని గుర్తుచేశారు. ప్రపంచం మొత్తం ఫ్రాన్స్‌కే వస్తోందని, అలా చేయడం సరికాదని హెచ్చరించినట్టు గుర్తుచేశారు.

యూరప్, ఫ్రాన్స్ దేశాల అధ్యక్షులు వెంటనే తమ దేశాల సరిహద్దులను మూసివేయాలని సూచించారు. మితిమీరిన వలసదారుల వల్లే అక్కడ అల్లర్లు చెలరేగుతున్నాయని ట్రంప్ ఆరోపించారు. ఐరోపా ఇప్పటికైనా సరిహద్దులను మూసివేసి నిరసనలు చేస్తున్న వారిలో నేరస్థులను గుర్తించకపోతే యూరప్ మొత్తం నాశనమైపోతుందని పునరుద్ఘాటించారు.ఇదిలాఉండగా, డొనాల్డ్ ట్రంప్ గతంలోనూ వలసవాదులకు వ్యతిరేకంగా పలుమార్లు కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఎన్నికల ప్రచారంలో అక్రమ వలసలను అరికడతామని అమెరికన్ పౌరులకు హామీ ఇచ్చారు.ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక వివిధ దేశాలకు చెందిన వలసదారులను తమ దేశానికి డిపోర్టు చేశారు.అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారిని పట్టుకుని తరిమేశారు. ఆ జాబితాలో భారతీయులు సైతం ఉన్న విషయం తెలిసిందే.

#Trump#America#france#riots#protests#muslim city#paris#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి