తెలంగాణ

Kavitha: ఎన్నికల బరిలోకి టీఆర్ఎస్.. అభ్యర్థిని ప్రకటించిన కవిత

రచన: NK•••3 నిమిషాల పఠనం

తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేస్తోంది.

Kavitha: తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేస్తోంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తమ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ పేరుని ప్రకటించారు కవిత. పట్టభద్రులు తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. బహుజనుల కోసం పోరాటం చేస్తానని ప్రకటించిన కవిత.. తన పార్టీ నుంచి తొలి అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేశారు.

జాగృతి ఆవిర్భావం నుంచి కవిత వెంటే

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లికి చెందిన శ్రీకాంత్ గౌడ్.. కాకతీయ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ చేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి ఆవిర్భావం నుంచి కవిత వెంట నడిచారు. తెలంగాణ రక్షణ సేనలో చేరినప్పటి నుంచి ఆ పార్టీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.

స్టేట్ పార్టీ అబ్జర్వర్‌ నియామకం

అభ్యర్థిని ప్రకటించిన కవిత.. పట్టభద్రుల ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేయడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఎన్నికల సమన్వయం, పర్యవేక్షణ కోసం స్టేట్ పార్టీ అబ్జర్వర్‌గా సయ్యద్ ఇస్మాయిల్‌ను నియమించారు. ఇక తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా కమిటీని కూడా కవిత ప్రకటించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా గుంజపడుగు హరి ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా బోడ రాకేష్ రెడ్డిని నియమించారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా ఎన్నికల బరిలోకి దిగడం అత్యంత ఆసక్తికరంగా మారింది.

#Kavitha#Trs#Graduate Mlc Elections#Mlc Polls#Telangana Rakshana Sena#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి