తెలంగాణ

Nagole: నాగోల్‌లో ఘోర ప్రమాదం.. ఒకరు మృతి.. భారీగా తాగునీరు వృథా

రచన: NK•••4 నిమిషాల పఠనం

హైదరాబాద్ నాగోల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 813 వద్ద కారు అదుపుతప్పి జలమండలి ప్రధాన వాటర్ పైప్ లైన్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంబీఏ విద్యార్థి వినీత్ (24) స్పాట్ లోనే చనిపోయాడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

Nagole: హైదరాబాద్ నాగోల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 813 వద్ద కారు అదుపుతప్పి జలమండలి ప్రధాన వాటర్ పైప్ లైన్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంబీఏ విద్యార్థి వినీత్ (24) స్పాట్ లోనే చనిపోయాడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. శంకర్ పల్లిలో ఎంబీఏ చదువుతున్న వినీత్.. శంకర్ పల్లి నుంచి ఉప్పల్ మీదుగా హయత్ నగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడి స్వస్థలం గుంటూరు జిల్లా. కారు బలంగా ఢీకొట్టడంతో పైప్ లైన్ ధ్వంసమైంది. ఎయిర్ వాల్వ్ దెబ్బతినడంతో భారీగా తాగునీరు వృథా అయ్యింది. విషయం తెలుసుకున్న జలమండలి అధికారులు నీటి సరఫరా నిలిపివేసి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు.

ఎయిర్ వాల్వ్ ధ్వంసం.. భారీగా తాగునీరు వృథా

కృష్ణా ఫేజ్ 2 పైప్ లైన్ వద్ద ఈ ఘటన జరిగింది. పైప్ లైన్ కు సంబంధించిన ఎయిర్ వాల్వ్ వ్యవస్థ దెబ్బతినడంతో తాగునీరు భారీగా వృథాగా పోయింది. సుమారు 6 గంటల పాటు తాగునీరు వృథా అయ్యింది. ఈ ఘటనతో నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. దెబ్బతిన్న ఎయిర్ వాల్వ్ ను మరమ్మత్తు చేయడంతో పాటు అవసరమైన పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు జలమండలి అత్యవసర చర్యలు తీసుకుంది. సాధ్యమైనంత తొందరగా పనులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని అధికారులను జలమండలి ఎండీ ఆదేశించారు.

ఆందోళనకు గురి చేస్తున్న తాగునీటి సమస్య

అసలే ఎల్ నినో ప్రభావం.. తాగునీటి కొరత ఆందోళనకు గురి చేస్తోంది. ఈ సమయంలో వాటర్ పైప్ లైన్ ను కారు ఢీకొట్టడం, భారీగా తాగునీరు వృథా కావడం నగరవాసులను కలవరానికి గురి చేసింది. కాగా.. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణం అని పోలీసులు భావిస్తున్నారు. మితిమీరిన వేగంతో వెళ్తున్న సమయంలో అదుపు తప్పిన కారు రోడ్డుపై ఉన్న ప్రధాన వాటర్ పైప్ లైన్ ను బలంగా ఢీకొందని తెలిపారు. అయితే వినీత్ మద్యం సేవించాడా? లేక నిద్రమత్తులో ఇలా జరిగిందా? అనే విషయాలు తెలియాల్సి ఉందన్నారు.

#Nagole#Car Accident#Krishna Water Pipeline#Nagole Metro Station#Uppal#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి